అట్లాంటాలో మంత్రి కన్నా లక్ష్మినారాయణ

అలంబాలోని టస్క్‌గీ విశ్వవిద్యాలయాన్ని, జార్జియా, అలంబాలోని వ్యవసాయ క్షేత్రాలను ఆయన సందరిశించారు. కన్నా లక్ష్మినారాయణ నేతృత్వంలోని ప్రతినిధి బృందంలో రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆచార్యులు కూడా ఉన్నారు.
అట్లాంటాలో తెలుగు కమ్యూనిటీ కన్నా లక్ష్మినారాయణ గౌరవార్థం మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. మంత్రి కన్నా లక్ష్మినారాయణను తెలుగు ఎన్నారైలు సత్కరించారు. రాంప్రకాష్ గూడూరి, రాజేష్ యల్లబండి, వెంకట్ మీసాల ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
రాష్ట్రాభివృద్ధి కోసం తమ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను కన్నా లక్ష్మినారాయణ వివరించారు. కొన్ని అడ్డంకులు ఎదురవుతున్పప్పటికీ రాష్ట్రం అన్ని రంగాల్లో ప్రగతిపథంలో పయనిస్తోందని ఆయన చెప్పారు. రాజేంద్ర ప్రసాద్ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ జాలయ్య మాట్లాడారు.












Click it and Unblock the Notifications