ఎన్నారై దాతృత్వం, గ్రామానికి ప్లాంట్

ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదు. దీంతో గ్రామ ప్రజలు సమీపంలోని పట్టణాల నుంచి మంచినీళ్లు తెచ్చుకునే పరిస్థితి ఉండేది. ఇరవై లీటర్ల మంచినీరు 15 నుంచి 18 రూపాయలు పలుకుతుంది. దానికితోడు రవాణా చార్జీలు కూడా ఉండేవి. దీంతో మంచినీటికి ఒక్కో కుటుంబం నెలకు 600 నుంచి 800 రూపాయలు ఖర్చు చేయాల్సి వచ్చేది.
గ్రామ యువకుల నుంచి విషాద గాధను విన్న లోకసత్తా ఎన్నారైలు గ్రామానికి సహాయం చేసేందుకు ముందుకు వచ్చారు. సమస్య పరిష్కారానికి రివర్స్ ఒస్మోసిస్ ప్లాంట్ స్థాపించాలని నిర్ణయించుకున్నారు. గ్రామానికి చెందిన తిరుమాన్ సీతయ్య, మోకా శ్రీరామమూర్తి దానికి భూమిని ఇవ్వడానికి ముందుకు వచ్చారు. ఎన్నారైలు ప్లాంట్ స్థాపనకు రూ.3,64,500 ఇవ్వాడనికి ముందుకు వచ్చారు. దీంతో గంటకు వేయి లీటర్ల మంచీనీరు అందించే ప్లాంట్ సిద్ధమైంది. ఈ ఏడాది జూన్ నుంచి అది పనిచేస్తోంది.
గ్రామంలో నవయుగ యూత్ ఫౌండేషన్ పేర ఏర్పాటు చేసిన యూత్ క్లబ్ దాన్ని నడుపుతోంది. పాఠశాలకు, వృద్ధులకు ఉచితంగా మంచినీరు సరఫరా చేస్తున్నారు. ప్లాంట్ నిర్వహణకు గాను 20 లీటర్లకు నాలుగు రూపాయల చొప్పున వసూలు చేస్తున్నారు. లోకసత్తా అధ్యక్షుడు డాక్టర్ జయప్రకాష్ నారాయణ ఈ నెల 19వ తేదీన ప్లాంట్‌ను గ్రామానికి అంకితం చేశారు.
గ్రామాలపై ప్రభుత్వం చేస్తున్న ఖర్చును వివరిస్తూ మట్లం వంటి గ్రామాలకు కనీస సౌకర్యాలు కూడా లేవని ఈ సందర్భంగా జయప్రకాష్ నారాయణ అన్నారు. ఈ ప్రాజెక్టు స్థాపన కోసం న్యూజెర్సీలో ఉంటునన శ్రీనివాస్ రనబోతు ఎన్నారైలను సమన్వయపరిచారు. జయప్రకాష్ వంటి నాయకుల స్ఫూర్తి వల్ల ఎన్నారైల ఉమ్మడి కృష్టి, సదుద్దేశంతో ఈ ప్లాంట్ న నిర్మాణం కార్యరూపం దాల్చిందని ఆయన ఈ ప్లాంట్ ప్రారంభ కార్యక్రమంలో అన్నారు.












Click it and Unblock the Notifications