వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రత్యేక బ్యాలెట్ కోసం లండన్ మార్చ్

By Pratap
|
Google Oneindia TeluguNews

London March for a special ballot
లండన్: లండన్‌లోని భారత హై కమీషన్ కార్యాలయం వద్ద ఎన్నారైలు ప్రవాసి భారత్ ఆధ్వర్వంలో ఆదివారంనాడు ప్రదర్శన నిర్వహించారు. లండన్ మార్చ్ పేర ఈ ప్రదర్సన నిర్వహించారు. యునైటెడ్ కింగ్‌డమ్‌లోని పలువురు భారతీయులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఊరేగింపు టవిస్కాక్ స్క్వేర్ వద్ద గల గాంధీ విగ్రహం వద్ద గుమికూడి అక్కడి నుంచి ఊరేగింపు తీశారు.

'మాకు ఓటు హక్కు కావాలి', 'భారత ప్రభుత్వాన్ని కోరుతున్నాం', 'మాకు ప్రత్యేక బ్యాలెట్ కావాలి' వంటి నినాదాలు చేస్తూ ఊరేగింపు సాగింది. ఎన్నారైలకు ప్రత్యేక బ్యాలెట్ సౌకర్యం కల్పించిన అదనపు పెద్ద ప్రజాస్వామాన్ని నెలకొల్పండి వంటి నినాదాలు రాసిన ప్లకార్డులను ప్రదర్శించారు. ఎన్నారైలను స్వయంగా ఓటు వేయడానికి మాత్రమే పరిమితం చేయకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్నారైలు పోస్టు ద్వారా లేదా ఆన్‌లైన్ ద్వారా ఓటు వేసే హక్కును కల్పించాలని వారు కోరుతున్నారు.

ప్రవాసి భారత్ వ్యవస్థాపకుడు, చైర్మన్ నాగేందర్ చిందం ఈ సందర్భంగా ప్రసంగించారు. ఎన్నారైలకు ఓటు ప్రాముఖ్యాన్ని ఆయన వివరించారు. తమ డిమాండ్‌కు గల నేపథ్యాన్ని ఆయన చెప్పారు. యాభై రోజుల క్రితం కూడా ఎన్నారైలు లండన్‌లో ఇటువంటి ప్రదర్శనే నిర్వహించారు.

బిజెపి ఓవర్సీస్ అధ్యక్షుడు లాలు భాయ్ పరేఖ్ ఎన్నారైల డిమాండ్‌కు మద్దతు తెలిపారు. ఎన్నారైల డిమాండ్‌ను ప్రభుత్వం ముందుకు పెట్టడానికి విషయాన్ని తమ పార్టీ నేత సుష్మా స్వరాజ్ దృష్టికి తీసుకుని వెళ్తానని ఆయన హామీ ఇచ్చారు. ఎన్నారైలకు ఓటు హక్కు కల్పించాలని, భారత్‌లో అవినీతిపై పోరాటానికి ఓటు హక్కు ఉపయోగపడుతుందని ఐఎసి కార్యకర్త కుందన్ శర్మ అన్నారు. బిజెపి ఓవర్సీస్ ప్రధాన కార్యదర్శి కూడా మద్దతు తెలిపారు.

English summary
Pravasi Bharat has organised 'Kondon Narch dor special ballot' near Indian High Commission office, London on october 21. Pravasi Bharat chairman Nagender Chidam explained the inportance of NRI voting right.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X