యుకెలో మరో భారత విద్యార్థి మృతి

NRI
యుకెలో అదృశ్యమైన భారత విద్యార్థి శవమై తేలాడు. ఇరవై ఏళ్ల గుర్దీప్ హయర్ అనే విద్యార్థి బర్మింగ్‌హామ్ నుంచి కనిపించకుండా పోయాడు. అతని శవం సోమవారం మాంచెస్టర్‌లో కనిపించింది. అతను ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే, విచారణాధికారులు దాన్ని ధ్రువీకరించాల్సి ఉంది. మాంచెస్టర్‌లో గత పక్షం రోజుల్లో మరణించిన రెండో భారత విద్యార్థి హయర్.

బాక్సింగ్ డే రోజును అనుజ్ బద్వే అనే 23 ఏళ్ల భారత విద్యార్థి మరణించిన విషయం తెలిసిందే. లాంక్‌స్టర్ విశ్వవిద్యాలయంలో చదువుతున్న ఈ విద్యార్థి ఓ దాడిలో మరణించాడు. హయర్ శవం మాంచెస్టర్ మీదుగా ప్రవహించే ఓ నదిలో కనిపించింది. అతను ఆత్మహత్య చేసుకుని ఉంటాడని, అతన్ని వేరేవాళ్లు చంపినట్లు ఏ విధమైన ఆనవాళ్లు లేవని పోలీసులు అంటున్నారు.

నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొనడానికి హయర్ డిసెంబర్ 31వ తేదీన బర్మింగ్ హామ్ నుంచి మాంచెస్టర్ వెళ్లాడు. ఆ తర్వాత మిత్రులతో కలిసి జనవరి 1వ తేదీ రాత్రి బయటకు వెళ్లాడు. జనవరి 2వ తేదీన అతను చివరిసారి కనిపించాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+