ఎన్నారైలతో ఎమ్మెల్యే దంపతులు

NRIs meet MLA couple from Mahaboobnagar district
ఎమ్మెల్యే దంపతులు కొత్తకోట దయాకర్ రెడ్డి, కొత్తకోట సీతా దయాకర్ రెడ్డి వారాంతంలో అమెరికాలోని కాలిఫోర్నియాలో ఎన్నారైలతో భేటీ అయ్యారు. ఈ భేటీలో పాలమూరు ఎన్నారైలతో పాటు తెలంగాణ, ఇతర ప్రాంతాల ఎన్నారైలు కూడా పాల్గొన్నారు. కొత్తకోట దయాకర్ రెడ్డి మహబూబ్‌నగర్ జిల్లాలోని మక్తల్ నియోజకవర్గం నుంచి, కొత్తకోట సీతా దయాకర రెడ్డి అదే జిల్లా దేవరకద్ర నుంచి శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

ఒకే జిల్లా నుంచి, ఒకే పార్టీ నుంచి వారిద్దరు శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దాదాపు 200 మంది ఎన్నారైలు నరేంద్ర కొత్తకోట నివాసంలో వారితో సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత రాజకీయాల గురించి, పరిస్థితి గురించి ఎన్నారైలు వారిని అడిగి తెలుసుకున్నారు.

ఎన్నారైలు ప్రస్తుత రాజకీయాల్లో అవినీతి గురించి, మహబూబ్‌నగర్ జిల్లా వెనకబాటు, దాని అభివృద్ధి గురించి, తెలంగాణ గురించి పలు ప్రశ్నలను వారికి వేశారు. వాటన్నింటికి దయకార్ రెడ్డి దంపతులు ఓపిగ్గా సమాధానాలు ఇచ్చారు. పాలన పెద్ద సవాల్‌ను ఎదుర్కొంటోందని వారు అభిప్రాయపడ్డారు. మహబూబ్‌నగర్ జిల్లా అభివృద్ధికి తాము చేస్తున్న కృషిని వివరించారు.

కూలీల వలసలు, నిరక్షరాస్యత, పారిశుధ్య లోపం వంటి సమస్యలను మహబూబ్‌నగర్ జిల్లా ఎదుర్కుంటోందని వారు చెప్పారు. ఈ స్థితిలో అభివృద్ధికి ఎన్నారైలు సహకరించాలని ఎమ్మెల్యే దంపతులు కోరారు. తాము తెలంగాణకు కట్టుబడి ఉన్నామని చెప్పారు.

ఎమ్మెల్యే దంపతులతో భేటీ అయినవారిలో విజయ్ చవ్వా, నరేంద్ర కొత్తకోట, భాస్కర్ మద్ది, కెవి రెడ్డి, విశ్వనాథ్ రెడ్డి, రాఘవేంద్ర, మధు వంగా వంటివారున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+