హజారేకు మద్దతుగా ఎన్నారైల ప్రదర్శన

PFL AND IAC NRIs support Anna Hazare
కాలిఫోర్నియా: అవినీతికి వ్యతిరేకంగా ఢిల్లీలో దీక్ష చేస్తున్న అన్నా హజారేకు మద్దతుగా దక్షిణ కాలిఫోర్నియాలోని ఎన్నారైలు జులై 28వ తేదీన ప్రదర్శన నిర్వహించారు. అవినీతిని నిరసిస్తూ, జనలోక్‌పాల్ బిల్లును సమర్థిస్తూ దాదాపు 50 మంది ఎన్నారైలు పయనీర్ బౌలవర్డ్ అర్టెసియా వద్ద ప్రదర్శన నిర్వహించారు. లోక్‌పాల్ బిల్లును ఆమోదించడంలో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ రెండు మైళ్ల వాక్ నిర్వహించారు.

ప్రభుత్వం ప్రతిపాదించిన లోక్‌పాల్ బిల్లుకు, పౌరసమాజం సూచిస్తున్న జన్‌లోక్‌పాల్ బిల్లుకు మధ్య గల వైరుధ్యాన్ని పరిష్కరించడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించడం లేదని లాస్ ఏంజెవలెస్ ఐఎసికి చెందిన శ్రీహరి అట్లూరి అన్నారు. అన్ని స్థాయిల్లోనూ పట్టిపీడిస్తున్న అవినీతి సమాజంలో విభజనకు కారణమవుతోందని రిటైర్డ్ కేశవలాల్ అన్నారు. గత ఐదు రోజులుగా దీక్ష చేస్తున్న సామాజిక కార్యకర్తల ఆరోగ్యం పట్ల పీపుల్ ఫర్ లోకసత్తా లాస్ ఏంజెలెస్ చాప్టర్ అధ్యక్షుడు వర్మ దంతలూరి అన్నారు. సమర్థవంతమైన బిల్లు ప్రతిపాదించడానికి ప్రభుత్వం ముందుకు రావాలని ఆయన డిమాండ్ చేశారు.

గత ఏడాది కాలంగా సామాజిక కార్యకర్త, గాంధేయవాది అన్నా హజారే, ఇండియా అగెనెస్ట్ కరప్షన్ ప్రతినిధులు బలమైన లోక్‌పాల్ బిల్లుకు డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆందోళనకారులు విమర్శించారు. కీలకమైన సభ్యులు గత నాలుగు రోజులుగా దీక్ష చేస్తున్నా ప్రభుత్వం సమర్థమైన లోకపాల్ బిల్లును తేవడానికి ప్రయత్నాలు చేయడం లేదని సామాజిక కార్యకర్తల శ్రీకాంత్ కోచర్ లకోటా అన్నారు.

మన స్వాతంత్ర సమరయోధులు స్వరాజ్యం కోసం పోరాటం చేశారని, అవినీతి రాజకీయాల వల్ల మనం సురాజ్యానికి చాలా దూరంగా ఉన్నామని, లోకపాల్ మాత్రమే మనకు సురాజ్యాన్ని ఖాయం చేస్తుందని కేశవలాల్ పటేల్ అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+