వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వెంటిలేటర్‌పై మెహ్దీ హసన్

By Pratap
|
Google Oneindia TeluguNews

Mehdi Hassan
భారత్‌లో పుట్టిన గజల్ సంగీత దిగ్గజం మెహ్దీ హసన్ ఆర్యోం ఆందోళనకరంగా ఉంది. ఆయను పాకిస్తాన్‌లో కరాచీలో గల ఆస్పత్రిలో వెంటిలేటర్‌పై ఉంచారు. ఆయనకు కృత్రిమ శ్వాస అందిస్తున్నారు. ఊపరితిత్తుల్లో తలెత్తిన సమస్యతో శ్వాస తీసుకోవడం ఆయనకు కష్టంగా ఉంది. ఈ సమస్యతో ఆయన చాలా కాలంగా బాధపడుతుున్నారు. ఆయనకు ప్రస్తతం 84 ఏళ్లు. హసన్ ఐసియులోనే ఉన్నారని, వైద్యులు 24 గంటలు పర్యవేక్షిస్తున్నారని, ఇప్పుడు అల్లాను ప్రార్థించడం తప్ప ఏమీ చేయలేమని హసన్ కుమారుడు ఆసిఫ్ మెహ్దీ అన్నారు. ఈయన కూడా గాయకుడే.

మెహ్డీ హసన్ 1927లో రాజస్థాన్‌లో లూనా గ్రామంలో సంప్రదాయ సంగీత కుటుంబంలో ఆయన జన్మించారు. అత్యంత ప్రజాదరణ పొందిన అబ్ కే బిచ్‌డే, పట్టా పట్టా బూట బూటా వంటి గజల్స్‌ను అందించిన హసన్ గొంతు ఇటీవలే పోయింది. హస్ ఛాతీ సమస్యతోనూ, మూత్రపిండాల సమస్యతోనూ బాధపడుతున్నారని వైద్యులు చెప్పారు. మంగళవారం హసన్‌ను ఆస్పత్రిలో చేర్చారు. గత రెండేళ్లుగా ట్యూబ్ ద్వారానే ఆహారం అందిస్తున్నట్లు ఆసిఫ్ చెప్పారు.

English summary
India-born legendary ghazal singer Mehdi Hassan was on Thursday put on a ventilator at a private clinic in Pakistan's Sindh provincial capital Karachi after he collapsed due to respiratory problems.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X