వీసా ఫ్రాడ్: తెలుగు విద్యార్థులు వీధుల్లో?

ఫెడరల్ ఏజెంట్స్ విశ్వవిద్యాలయంపై దాడులు చేసిన సిఇవోపై వీసా ఫ్రాడ్ అభియోగాలు మోపారు. దీంతో శాంతాక్రజ్‌లోని నివాసంలో హెర్గ్యూన్ విశ్వవిద్యాలయం సిఇవో జెర్రీ వాంగ్‌ను అరెస్టు చేశారు. ఆరోపణలు రుజువైతే అతనికి 23 ఏళ్ల జైలు శిక్ష, మిలియన్ డాలర్ల జరిమానా పడుతుంది.
హెర్గ్యూన్ విశ్వవిద్యాలయం వాంగ్, ఇతరులు హెర్గ్యూన్ విశ్వవిద్యాలయంలో నకిలీ పత్రాలు, తప్పుడు బదిలీ లేఖలతో తప్పుడు లేఖలు ఫెడరల్ రెగ్యులేటర్స్‌కు సమర్పించారని ఆరోపణలు వచ్చాయి. హెర్గ్యూన్ విశ్వవిద్యాలయంలో చేరిన 450 మంది విద్యార్థుల ఇమిగ్రేషన్ స్టేటస్ ఇప్పుడు సందేహంలో పడింది. ఏమవుతుందో అంతు బట్టడం లేదని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నిరుడు ట్రైవ్యాలీ విశ్వవిద్యాలయంలో ఇదే సమస్యను ఎదుర్కున్నప్పుడు డజన్ల కొద్ది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ట్రైవ్యాలీ విశ్వవిద్యాలయం సుసాన్ సూ మిలియన్ల కొద్ది డాలర్ల వీసా స్కామ్‌కు పాల్పడినట్లు బయటపడింది. హెర్గ్యూన్ విశ్వవిద్యాయం వంటి మరిన్ని సంస్థలు ఉండవచ్చునని సంబంధిత అధికారులు అనుమానిస్తున్నారు.












Click it and Unblock the Notifications