లండన్‌లో తెలంగాణ విమోచన దినోత్సవం

తమ ఫోరం కార్యక్రమాలను గంప వేణుగోపాల్ వివరించారు. ఈ నెల 30వ తేదీన జరిగే చలో లండన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. సెప్టంబర్ 30వ తేదీ లోపల తెలంగాణ వస్తుందని ఏనుగు రవీందర్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ వస్తే సంబరాలు చేసుకుందామని, రాకుంటే సమరానికి సిద్ధం కావాలని ఆయన అన్నారు. తెలంగాణ ఎన్నారై ఫోరం కార్యక్రమాలను ఆయన ప్రశంసించారు.
1948 సెప్టెంబర్ 17 నాటి చరిత్రను, బ్రిటిష్, రజాకార్లనాటి సంఘటనలను శ్రీధర్ వివరించారు. సాహిత్యంలో తాను వివక్షను ఎదుర్కున్నానని, సాహిత్యం ఉద్యమాలకు ఎంతో దోహదం చేస్తుందని హేమా మాచర్ల అన్నారు. తెలంగాణ ఎన్నారైలు తనను సన్మానించడం పట్ల ఆమె సంతోషం వ్యక్తం చేశారు.
తెలంగాణ కోసం పోరాడే అన్ని సంస్థలు కలిసి పనిచేయాలని తెలంగాణ ఎన్నారై ఫోరం సభ్యుడు అనిల్ కూర్మాచలం సూచించారు. సభా ప్రారంభానికి ముందుకు తెలంగాణ అమరవీరులకు కొవ్వొత్తులతో నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమాన్ని తెరాస ఎన్నారైల సహకారంతో నిర్వహించారు.
చందూగౌడ్, రాజ్, వెంకట్, పెద్దిరాజు శ్రీకాంత్, అశోక్, హరి, సత్య, ప్రసాద్, పవిత్ర రెడ్డి, సనీన్ రెడ్డి, పోచారం సురేందర్ రెడ్డి ఆల వెంకట్ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.












Click it and Unblock the Notifications