అమెరికాలో తెలుగువారి సుఖీభవ

ప్రవాసాంధ్ర పౌరులు వ్యక్తిగతంగా, వృత్తిపరంగా, కుటుంబపరంగా, సాంఘికపరంగా ఎన్నో బాధ్యతలను విజయవంతంగా నిర్వహిస్తున్నారు. వీటన్నిటిలో విజయాన్ని, ఉన్నతిని సాధించే ప్రక్రియలో, ఈ తెలుగు నాయకులు ఒక కీలక విషయంపై అంత శ్రద్ధ వహించడం లేదు. అదేమంటే, తన స్వంత వ్యక్తిత్వ, ఆరోగ్య పరిరక్షణ, గురజాడ స్వంత లాభం కొంత మానుకు, పొరుగువాడికి తోడుపడవోయ్, గట్టి మేల్ తలపెట్టవోయ్ అన్నారు. అంతేకానీ స్వంత క్షేమం మానుకుని అనికాదు. ఒక్కోసారి ఆ గురడాడ సూక్తిని అక్షరాలా పాటిస్తూ పరుగులు తీయడంలో కాస్తా ఎక్కువ ఒత్తిడికి లోనవుతామేమోనని అనిపిస్తుంది.
మనకు సంబంధించిన వివిధ పార్శ్వాలు, మనల నుంచి విలువైన సమయాన్ని, శక్తిని,త యుక్తిని, ప్రతిభని, కార్యదక్షతని, నాయకత్వ లక్షణాలము నిత్యం కోరుకుంటాయి. వాటన్నిటికీ న్యాయం చేస్తూ, అన్ని చోట్లా మన్ననలు పొందుతూ, మానసిక ఆనందాన్ని, సంతృప్తిని అత్యున్నత స్థాయిలో పొందడం అంత తేలికైన విషయం కాదు. దానికొక నిర్దిష్టమైన మార్గం, దిశా నిర్దేశకత్వం, ప్రణాళిక, పద్ధతి, క్రమశిక్షణతో కూడిన పరిశ్రమ, ముఖ్యమైన వనరులు అవసరం. మరి ఆ మార్గాన్ని కనుగొని, ఆ దిశలో అందరూ కలిసి నడవడానికి సహాయంగా ఏర్పాటు చేసిన విభాగమే సుఖీభవ.
టాంటెక్స్ ఉత్తరాధ్యక్షుడు మండువ సురేష్ ఆలోచనకు వ్యవస్థీకరణకు గత ఆదివారం అంకురార్పణ జరిగింది. తన నేతృత్వంలో జరిగిన మొదటి సుఖీభవ సమావేశం ఇది. తర్వాత టాంటెక్స్ అధ్యక్షులు దమ్మన్న గీత ఈ మంచి ఆలోచనను కార్యరూపంలోకి తెచ్చినందుకు టాంటెక్స్ కార్యవర్గ సభ్యులను అభినందించారు. ముఖ్య వక్తలుగా వచ్చిన రమాకాంత్ నిత్యజీవితంలో ఒత్తిడి ప్రభావం తగ్గించుకోవడం ఎలా అనే విషయంపై మాట్లాడారు.
మన ఆరోగ్య పరిరక్షణకు పరుగు ఎంత ముఖ్యమో తెలుసుకోవడం కోసం, రన్ మామా రన్ అనే శీర్షికతో డల్లాస్ నగరం తెలుగువారిలో ఎనిమిది మారథాన్‌లు పూర్తి చేసుకుని పరుగు పందేల వీరుడు అనదగిన పోసంగి గోపాల్ తన స్వీయ అనుభవాలతో కలిపి అతి చక్కటి ప్రసంగం ఇచ్చారు. ఆయనతో పాటు మారథాన్ పరుగు పందెం పూర్తి చేసిన వివేక్ ఘనేకర్, రాయవరం భాస్కర్ తమ జీవితాల్లో పరుగుల ప్రయాణాలు ఎలా మొదలు పెట్టారు. తాము నేర్చుకున్న విషయాలు ఏమిటనే విషయాలపై మాట్లాడారు.
ఆ తర్వాత విద్యాదానం సంస్థ, సిలికానాంధ్ర మనబడి, ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం సంయుక్తంగా నిర్వహించే అయిదు కిలోమీటర్ల పరుగు పందెం గురించి వివరించారు. సభ చివరలో సుఖీభవ జట్టు సభ్యులు జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం వందన సమర్పణ చేశారు. ఈ కార్యక్రమంలో సుఖీభవ జట్టు సభ్యులు చిట్టిమల్ల రఘు, వనం జ్యోతి, టెక్సాస్ తెలుగు సంఘం కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications