ఒలింపిక్ టార్చ్ చేతపట్టిన సాయి

ఒలింపిక్ కాగడా ధరించే అదృష్టం సాయి విశాల్‌కు దక్కడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు. దాన్ని అతను కష్టపడి సాధించాడని వారు చెప్పారు. చదువు, చారిటీ, స్పోర్ట్స్‌లను పరిగణనలోకి తీసుకుని చారిటీ వర్క్స్‌లో చూపిన ప్రతిభకు గాను 12 ఏళ్ల సాయి విశాల్‌కు కాగడా ధరించే అవకాశం దక్కిందని వారు చెప్పారు. చదువులో కూడా అతను అగ్రభాగాన ఉన్నాడని, దీన్ని కూడా లెక్కలోకి తీసుకున్నారని వారన్నారు.
ఒలింపిక్స్ టార్చ్‌ని మేరీ జాయ్ (సామాజికవేత్త) చేతుల మీదుగా తీసుకుని ర్యాలీ అనంతరం లండన్ స్పోర్ట్స్ స్టార్ జాక్‌కు అందించినట్లు వారు తెలిపారు. సాయి విశాల్ మార్జరీ కేనన్ స్కూల్లో చదువుతున్నాడు. అతను హోన్సోలో కౌన్సిల్ చారిటీ వర్క్స్‌లో ముందుండి తన తోటి విద్యార్థులకు ఆదర్శంగా నిలిచాడని వారు చెప్పారు. సాయి విశాల్ తండ్రి రామరాజు స్వస్థలం ఖమ్మం జిల్లా.
తెలంగాణ ఎన్నారై ఫోరం సభ్యులు సాయి విశాల్‌కు ఈ అవకాశం దక్కడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలు గర్వించదగిన విషయమని వారన్నారు.












Click it and Unblock the Notifications