అమెరికాలో తెలుగు విద్యార్థి కాల్చివేత

అయితే, అగంతకులు శేషాద్రిని లక్ష్యంగా చేసుకుని హత్య చేశారా? లేక వేరే ప్రత్యేక కారణమేదైనా ఉందా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని బోస్టన్ పోలీస్ కమిషనర్ ఎడ్వర్డ్ ఎఫ్ డేవిడ్ వెల్లడించారు. వారం వ్యవధిలో ఈ పట్టణంలో జరిగిన హత్యల్లో ఇది నాలుగోది. శేషాద్రి హత్యపై యూనివర్సిటీ కూడా తీవ్రంగా స్పందించింది. జరిగిన దానికి విచారం వ్యక్తం చేస్తూ... మృతుడి కుటుంబ సభ్యులకు, స్నేహితులకు సంతాపాన్ని తెలియజేస్తున్నట్లు ప్రకటించింది. యూనివర్సిటీలో చదువుకునే విద్యార్థుల్లో ఎవరు కోరినా వారికి తగినంత భద్రత కల్పించాలని డీన్‌కి యూనివర్సిటీ అధ్యక్షుడు బ్రౌన్ సూచించారు.
మరోవైపు శేషాద్రి మృతదేహాన్ని స్వదేశానికి పంపేందుకు తానా ఏర్పాట్లు చేస్తోంది. ఇండియన్ కాన్సులేట్ అధికారులతోపాటు, శేషాద్రి కుటుంబ సభ్యులతో తానా ప్రతినిధి మోహన్ నన్నపునేని సంప్రదింపులు జరుపుతున్నారు. శేషాద్రి కుటుంబం ఒరిస్సాలోని బర్హంపూర్‌లో స్థిరపడింది. శేషాద్రి తండ్రి కనగాల సుధాకర్‌రావు డిప్యుటేషన్‌పై ఉత్కళ్ గ్రామీణ బ్యాంకులో రీజినల్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు.












Click it and Unblock the Notifications