ఆటా సభల్లో వైయస్ జయంతి

అమెరికా తెలుగు సంఘం (ఆటా) 12వ మహాసభల్లో ఘనంగా మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి జన్మదిన వేడుకలను జూలై 8వ తేదీన ఘనం జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డా. లక్కిరెడ్డి హనిమిరెడ్డి, ప్రత్యేక అతిథిగా భారత రక్షణ శాఖ సహాయ మంత్రి శ్రీ పల్లం రాజు విచ్చేశారు. ముఖ్య అతిథి, ప్రత్యేక అతిథులతో పాటుగా ఇతర అతిథులు, ఆటా అధ్యక్షులు డాక్టర్ రాజేందర్ జిన్నా, మాజీ అధ్యక్షులు, వ్యవస్థాపక సభ్యుడు హన్మంత్ రెడ్డి, మాజీ అధ్యక్షురాలు శ్రీమతి సంధ్యా గవ్వ, మోహన్ రెడ్డి తలమర్ల (చికాగో), కరుణాకర్ మాధవరం (ఆటా అధ్యక్షులు-ఎలెక్ట్), హరికృష్ణా రెడ్డి (పుట్టపతి - వైయస్సార్‌సిపి), గోనె ప్రకాష్ రావు, నర్సా రెడ్డి (ఎమ్మెల్యే), భూపాల్ రెడ్డి (ఎమ్మెల్సీ), గజల్ శ్రీనివాస్, జిట్టా సురేందర్ రెడ్డి, ఆసిరెడ్డి దయాకర్ రెడ్డి జననేత రాజశేఖర రెడ్డిచిత్ర పటానికి పూలమాలలు వేసి జ్యోతిని వెలిగించారు.

YSR birthday celebrations in ATA Conference

హరిప్రసాద్ రెడ్డి లింగాల (డెట్రాయిట్) అతిథులకు స్వాగతంపలికి తరువాత డా. వైయస్ రాజశేఖర్ రెడ్డి జీవిత ప్రాముఖ్యతను, మహానేత ఏవిధంగా కోట్లాదిమంది ప్రజల జీవితాలను తాకారో, ఎలా వారి హృదయాల్లో కొలువై వున్నారో వివరించారు. ఈ కార్యక్రమంలో డా. వైయస్సార్ వారసత్వానికి సంబంధించి ఒక వీడియోని ప్రదర్శించారు. హరి లింగాల, గురవా రెడ్డి, గోపీనాథ్ రెడ్డి, కెఎస్ఎన్ రెడ్డి, యుగంధర్, శ్రీనివాస్ కొట్లూరు, పమ్మి సుబ్బా రెడ్డి, రమేష్ వల్లూరు, శంకర్ బండి, ప్రసాద్ రెడ్డి, మల్లు, రఘు పాడి, పురశోథం, శ్రీధర్ టి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

శ్రీ పల్లంరాజు తన ప్రసంగంలో డా. వైయస్సార్ వంటి గొప్ప నేతతో వారి నేతృత్వంలో పని చేయడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. వైయస్సార్ మన రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు చేసిన విశిష్టమైన సేవల్ని గుర్తు చేసారు. డాక్టర్ లక్కిరెడ్డి హనిమి రెడ్డి తన ప్రసంగంలో డా. వైయస్ రాజశేఖర రెడ్డితో తనకున్నటువంటి అనుభవాలను పంచుకున్నారు. వైయస్ జగన్ 2014 ఎన్నికల్లో సంపూర్ణ మెజారిటీతో ముఖ్యమంత్రిగా గెలిచి వైయస్ రాజశేఖర రెడ్డి మన రాష్ట్రాభివ్రుధికి, రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం కన్న కలల్ని నెరవేరుస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

డాక్టర్ హరికృష్ణా రెడ్డి, గోనె ప్రకాష్ రావు కూడా ప్రసంగించారు. వారు వైయస్ రాజశేఖర రెడ్డి ప్రసిద్ధ సంక్షేమ పథకాలను గుర్తుచేసుకున్నారు. మన రాష్ట్ర సంక్షేమం కోసం జగన్ కు మద్దతు తెలపాల్సిన అవసరాన్ని గుర్తు చేసారు. గజల్ శ్రీనివాస్ డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డితో తనకున్న అనుభవాలను గుర్తు చేసుకున్నారు. మహానేత మీద గజల్స్, పాటలు వినిపించి శ్రోతలను తన్మయత్వంలో ముంచెత్తారు. శ్రీనివాస రాజు డా. వైయస్ మీద భావోద్వేగంతో ఒక పాటను ఆలపించారు. గౌరవ అతిథులతో పాటు ఈ కార్యక్రమంలో ఇతర ఎన్నారైలు గురవా రెడ్డి, శ్రీధర్ కొర్సపాటి, రమేష్ వల్లూరు, డాక్టర్ రామచంద్ర రెడ్డి, కెఎస్ఎన్ రెడ్డి, డాక్టర్ వాసుదేవ రెడ్డి, సత్య కందిమల్ల, శరత్చంద్రా రెడ్డి మాట్లాడారు.

డాక్టర్ హనిమి రెడ్డి ఇతర అతిధులతో పాటుగా డా. వైయస్ రాజశేఖరరెడ్డి పుట్టినరోజు కేకును కట్ చేయగా ప్రేక్షకులు భావోద్వేగంతో డాక్టర్ వైయస్ అమర్ రహే అంటూ పెద్దగా నినాదాలు చేసారు. ఈ కార్యక్రమ నిర్వాహకులు అవకాశం కల్పించిన ఆటాకు ధన్యవాదాలు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+