డెట్రాయిట్‌లో వైయస్సార్ వర్ధంతి

తమ ప్రియతమ నాయకుడు డాక్టర్ వైఎస్‌ఆర్ అందించిన సువర్ణ పాలనను వారు గుర్తు చేసుకున్నారు. మహానేత మన రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు చేసిన విశిష్టమైన సేవల్ని, ప్రసిద్ధ సంక్షేమ పథకాలను ప్రస్తావించారు. అనునిత్యం ప్రజల్లో ఉంటూ వారికి బాసటగా నిలుస్తున్న తమ పార్టీ అధినేత జగన్‌కు ఎప్పటిలాగే ప్రజామద్దతు కొనసాగుతుందని వారు పేర్కొన్నారు.
వైయస్ జగన్ 2014 ఎన్నికల్లో సంపూర్ణ మెజారిటీతో ముఖ్యమంత్రిగా గెలిచి వైయస్సార్ మన రాష్ట్రాభివ్రుధికి, రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం కన్న కలల్ని నెరవేరుస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రాభివృద్ది కొరకు యువనేత వైయస్ జగన్మోహనరెడ్డికి బాసటగా నిలువాలన్నారు. మన రాష్ట్ర సంక్షేమం కోసం జగన్ కు మద్దతు తెలపాల్సిన అవసరాన్ని గుర్తు చేసారు.
లింగాల హరిప్రసాద్ రెడ్డి, వినోద్ కుకునూర్, వెంకట్ బీరం, సునీల్ మండుటి, యార్లగడ్డ శివరాం, వినోద్ ఆత్మకూర్, భూమిరెడ్డి యుగంధర్, పురషోత్తం కూకటి, శ్రీనివాస్ చిట్టలూరి, కొండ జగన్, పిడపర్తి శ్రీనివాస్, రవి కిరణ్, నాగేందర్ గాలి, విద్యాధర్ రెడ్డి బుజాల, వేణు కాగితాల, శేఖర్ పంగరు, శ్రీనివాస్ బార్ల, కొండ రెడ్డి తోట్టిరెడ్డి, రమణ రెడ్డి పటేలు, సుధీర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారిలో వున్నారు. డెట్రాయిట్ నగరంలో డాక్టర్ వైయస్సార్ పేరిట సమీప భవిష్యత్తులో చేపట్టే సేవా కార్యక్రమాలపై వారు ఈ సందర్భంగా చర్చించారు.












Click it and Unblock the Notifications