బాల్కనీ నుంచి దూకిన ఆంధ్ర యువతి

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 19 ఏళ్ల అనూష ఓ ఏజెంట్ ద్వారా నకిలీ విజిటింగ్ వీసాతో గత నెల బహ్రెయిన్‌కు వచ్చింది. ఈ ఇంట్లో పని మనిషిగా కుదిరింది. ఇరవై నాలుగు గంటలూ పనిచేయాలని యజమానులు వేధించడంతో ఆమె బాల్కనీ నుంచి కిందకు దూకేసినట్లు చెబుతున్నారు.
పనిమనుషులను ఎక్కువగా పని చేయించడమే కాకుండా వారిపట్ల దురుసుగా ప్రవర్తించినట్లుగా కూడా ఆరోపణలు వచ్చాయి. ఇద్దరు ఇండోనేషియా పని మనుషుల గురించి ఎంబసీకి తెలిపినట్లు, ఆంధ్ర మహిళ కేసుపై ముందుకు సాగుతున్నట్లు, ఆమె చేయి,కాళ్లు ఫ్రాక్చర్ అయినట్లు, సర్జరీ చేయాల్సి ఉన్నట్లు మైగ్రెంట్ వర్కర్స్ ప్రొటెక్షన్ సొసైటీ చైర్ పర్సన్ మార్యేటా డయాస్ చెప్పారు.
నకిలీ విజిట్ వీసాపై అనూష వచ్చినట్లు, భారతదేశంలోనే దాన్ని ఫోర్జరీ చేసినట్లు స్పష్టమైన ఆధారాలున్నట్లు డయాస్ చెప్పారు.












Click it and Unblock the Notifications