న్యూజెర్సీలో ఆటా సమ్మర్ ఫెస్ట్
న్యూజెర్సీ: అమెరికాలోని న్యూజెర్సీలో అమెరికా తెలుగు సంఘం (ఆటా) సమ్మర్ ఫెస్ట్ 2013ను ఈ నెల 16వ తేదీన నిర్వహించింది. న్యూజెర్సీ, పెన్సిల్వేనియా, న్యూయార్క్, డేలవారే, కనెక్టికట్‌లకు చెందిన పెద్దలు, పిల్లలు దాదాపు వేయి మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. యువకులు, పెద్దలు అనే తేడా లేకుండా వచ్చేశారు.
పిల్లలకూ పెద్దలకూ వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఆనందోత్సాహాలతో వాతావరణం ఉల్లాసభరితంగా మారింది. న్యూజెర్సీ అసెంబ్లీమ్యాన్ ఉపేంద్ర చివుకుల, సినీ సంగీత దర్శకుడు వడ్డేపల్లి కృష్ణ, ఆటా ప్రెసిడెంట్ ఎలెక్ట్ సుధాకర్ పెర్కారి, మాజీ అధ్యక్షుడు రాజేందర్ జిన్నా ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్ారు. పిల్లలు, పెద్దలు పచ్చబొట్లు పొడిపించుకోవడం, ముఖానికి రంగులు అద్దుకోవడంతో కార్యక్రమం ప్రారంభమైంది. ఆ తర్వాత క్రీడలు జరిగాయి. వాలీబాల్‌లో టెక్‌న్యూమాన్ జట్టు విజయం సాధించింది. పిల్లలకు రన్నింగ్ రేస్, లెమన్ అండ్ స్పూన్ క్రీడలు జరిగాయి.

టగ్ ఆఫ్ వార్‌లో ప్రతి ఒక్కరూ పాల్గొన్నారు. దీన్ని అందరూ ఆనందించారు. పిల్లలు, మహిళలు, పురుషులను మూడు గ్రూపులుగా విభజించి, ఆ తర్వాత రెండు గ్రూపులు చేసి ఈ క్రీడను నిర్వహించారు జమునా పుష్కర్, మాధవి అరువా, భాను మాగంటి, విజయ తుమ్మల ఆటా వాలంటీర్లతో కలిసి క్రీడలు నిర్వహించారు.
ఉజ్వల చిన్ని, కృష్ణ, లలితా రాణి మెలోడీ గేయాలు ఆలపించి, శ్రోతలను అలరించారు. పిల్లలు శాస్త్రీయ, జానపద, టాలీవుడ్, బాలీవుడ్ సినిమా నృత్యాలు చేశారు. ప్రతీక్, అతని బృందం భంగ్రా నృత్యం విశేషంగా ఆకట్టుకుంది. కన్వీనర్ పర్మేష్ భీమ్‌రెడ్డి ప్రసంగించారు. రాబోయే 13వ ఆటా సమ్మేళనం గురించి ఆయన వివరించారు. వచ్చే ఏడాది జూలైలో ఫిలడెల్ఫియాలో ఈ సమ్మేళనం జరుగుతుంది. కార్యక్రమ నిర్వహణకు సహకరించిన సురేష్ జిల్లాకు, డిజె సర్వీసులు అందించిన అనిల్ ఆకులకు కృతజ్ఞతలు తెలిపారు.
కార్యక్రమాన్ని పర్మేష్ భీమ్‌రెడ్డి సమన్వయం చేయగా, ఆటా ప్రాంతీయ సమన్వయకర్తలు రఘువీర్ రెడ్డి, భగవాన్ పింగ్లే నిర్వహించారు. స్థానిక ట్రస్టీలు పరుశురామ్ పిన్నపురెడ్డి, బల్వంత్ కొమ్మిడి, కృష్ణా ద్యాప, వినోద్ కోడూరు, సురేష్ జిల్లా, లక్ష్మణ్ ఏనుగు, స్టాండింగ్ కమిటీ చైర్స్ శ్రీకాంత్ గుడిపాటి, మహి సన్నపురెడ్డి, మాజీ కోశాధికారి నారాయణ పిర్లమర్ల, ఆటా సభ్యులు, ఆటా మిత్రులు రవి పట్లోళ్ల, శ్రీనివాస్ దర్గుల, విజయ్ కుందూరు, వేణే సంకినేని, రాజ్ చిలుముల, వెంకట్రామ్ వేమువరామ్, రవి పెద్ది, శ్రీనివాస్ రనబోతు సహకరించారు. రమేష్ మాగంటి, ప్రదీప్ సువర్ణ నిర్వహించారు.
డేలావరే వ్యాలీ నాయకులు, ఆటా సమ్మేళనం సహ కన్వీనర్ మాధవ్ మోసర్ల, ప్రాంతీయ సహ సమన్వయకర్తలు వెంకట్ రావు మాదిపడగ, గోవింద్ రెడ్డి కొండకింది కార్యక్రమానికి హాజరయ్యారు.












Click it and Unblock the Notifications