అమెరికాలో అయ్యప్ప పడిపూజ

గురు స్వాములు కిరణ్ ముదిగొండ, శ్రీనివాస సరఫ్ఫ్ స్వాముల ఆధ్వర్యం లో పడిపూజ జరిగింది. మాలలతో అలంకరించిన విజ్ఞేశ్వర, సుబ్రమణ్య స్వాములతో పువ్వులు దీపాలు, పండ్లతో అలంకరించిన పద్దెనిమిది పడి మెట్లపై స్వామి సేద తీరాడు. అయ్యప్ప సాయి భజనలతో భక్తులు తన్మయత్వం చెందారు.
స్వామివారికి పుష్పాభిషేకం, పంచామృతం, చందనం, విభూదితో అభిషేకం చేశారు. స్వామివారికి ప్రియమైన పొంగళ్ళు నైవేద్యం సమర్పించారు. అనంతరం పద్దెనిమిది మెట్లపై పిల్లల చేత కర్పూర దీపం వెలిగింపజేశారు. అనతరం గురుస్వాములు అయ్యప్ప మహిమల గురించి, మాలధారణ గురించి చెప్పారు. అనంతరం భక్తుల సందేహాలను తీర్చారు. చాల కాలం తర్వాత పడిపూజలో పాల్గొనడం ఆనందంగా ఉందని భక్తులు తెలిపారు.
ఈ కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయ్యప్ప పడిపూజ చేయడం సంప్రదాయం. ఆ సంప్రదాయాన్ని అమెరికాలోని ఎన్నారైలు పాటించారు.












Click it and Unblock the Notifications