బోనమెత్తిన ఎన్నారైలు (ఫొటోలు)
సిన్సినాటి: బోనాల పండుగ అనగానే మనకు గుర్తుకు వచ్చేది తెలంగాణలోని గ్రామ దేవతలు, చక్కగా అలంకరించిన బోనాలు, పోతురాజుల నృత్యాలు, ఆడబిడ్డల భక్తిభావాలతో కూడిన పాటలు. ఖండాంతరాలు దాటినా తెలంగాణ సంస్కృతిని మరువని తెలంగాణా ముద్దుబిడ్డలు తెలంగాణ ఎన్నారైలు బోనాల పండుగ జరుపుకున్నారు.
సిన్సినాటి అనే పట్టణానికి చెందిన తెలంగాణ ఎన్నారై గ్రూప్ "గ్రేటర్ సిన్సినాటి తెలంగాణా అసోసియేషన్ (జిసిటిఎ) " ఆధ్వర్యంలో జూలై 14వ తేదీ ఆదివారం నాడు బోనాల పండుగను సంప్రదాయకంగా, కన్నుల విందుగా నిర్వహించింది. "మన బొట్టు, మన బోనం, మన సంస్కృతి" అనే పదాలను మరువకుండా రెండవ సారి కూడా అమెరికా లోని సిన్సినాటి పట్టణంలో బోనాల పండుగ జరిపి తెలంగాణా ఎన్నారైలు చరిత్ర సృష్టించి తెలంగాణా సంస్కృతి ని వెలుగు ఎత్తి చాటారు
ఓహియో రాష్ట్రంలోని, గ్రేటర్ సిన్సిన్నాటి ఏరియాలో మేసన్ అనే పట్టణంలో జరిగిన ఈ కార్యక్రమానికి పెద్దలు, తల్లులు, ఆడబిడ్డలు, యువతీయువకులు, పిల్లలు ఎంతో ఉత్సాహంగా పాల్గొని తెలంగాణా గ్రామదేవతలకు మూలమైయిన "ఆది శక్తి" కి బోనం సమర్పించారు. ఆట పాటలతో అందంగా అలంకరించిన బోనాల్ని ఎత్తుకొని ఎన్నారై ఆడపడచులు అమ్మోరుని అత్యంత భక్తి భావాలతో పూజించుకున్నారు.
గ్రేటర్ సిన్సినాటి తెలంగాణా అసోసియేషన్ గ్రూప్ ప్రతిస్తాత్మకంగా తీసుకొని భక్తులకు కావలసిన అన్ని సదుపాయాలు ఏర్పరచింది. కమిటి ఆద్వర్యంలో రుచికరమైన వంటలను, పానీయాలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన సిన్సిన్నాటి లోని పెద్దలు బోనాల తల్లికి పండ్లు పుష్పాలు సమర్పించి, విచ్చేసిన వారందరికీ శుభాకాంక్షలు తెలియజేసి, వారి పిల్లలకు పండుగ ప్రాముఖ్యత వివరించారు.
కమిటి సభ్యులు వేణు కైల, సీతారాం బోయినేపల్లి, గణేష్ కోట, శ్రీధర్ రెడ్డి పల్లె, శోభన్ పొన్న, సురేష్ దేవరకొండ, చంద్ర మదిచెట్టి, విశ్వేశ్వర్ రెడ్డి గాట్ల, ఫుర్మా రెడ్డి నల్లా విచెసిన వారందరికి కృతజ్ఞత తెలుపుతూ, కార్యక్రమాన్ని జయప్రదంగా ముగించారు. సుమారు నూట యాబై మంది పాల్గొన్న ఈ రెండవ ఏడాది "సిన్సినాటి బోనాల పండుగ" అత్యంత వైభావంగా జరిగింది.

ఎన్నారై మహిళలు తాము పుట్టిన గడ్డ మీద మక్కువతో సంస్కృతిపై ప్రేమతో ఇలా బోనమెత్తారు. వారికి పురుషులు సహాయం చేశారు.

బోనాలు ఎత్తుకుని అత్యంత భక్తిభావంతో ఎన్నారై తెలుగు మహిళలు అత్యంత ఉత్సాహంగా కనిపించారు. ఇలా బారులు తీరారు.

బోనాల కార్యక్రమం సందర్భంగా ఇలా ఎన్నారై స్త్రీపురుషులు, పిల్లలు ఆనందంతో గడిపారు. వారిలో ఉత్సాహం కొట్టొచ్చినట్లు కనిపించింది.

ఖండాంతరాలు దాటిన తెలుగువారు తమ అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి పండుగలను, పబ్బాలను వాహికగా చేసుకుంటున్నారు. ఇందులో భాగంగానే ఎన్నారైలు ఇలా బోనాలు ఎత్తుకుని తమ ఉనికిని చాటుకున్నారు.

బోనాల పండుగ జరుపుతూనే ఫ్యామిలీ పిక్నిక్‌గా ఇలా మార్చుకున్నారు. ఇలా మహిళలు తమ అస్తిత్వాన్ని చాటుకున్నారు.

బోనాలను ఎత్తుకోవడాన్ని ఎన్నారై మహిళలు గర్వంగానే ఫీలవుతున్నారు. తమ సంస్కృతిని తమ పిల్లాపాపలకు పంచాలని ప్రయత్నిస్తున్నారు.

అమెరికాలోని ఎన్నారైలు తమ పిల్లలకు తమ సంస్కృతీసంప్రదాయాలను వారసత్వంగా ఇవ్వాలనే ఆసక్తితో ఉన్నారు. అందుకే ఇలా చిన్నారితో బోనమెత్తించారు.

"మన బొట్టు, మన బోనం, మన సంస్కృతి" అనే పదాలను మరువకుండా రెండవ సారి కూడాఅమెరికా లోని సిన్సినాటి పట్టణంలో బోనాల పండుగ జరిపి తెలంగాణా ఎన్నారైలు చరిత్ర సృష్టించి తెలంగాణా సంస్కృతి ని వెలుగు ఎత్తి చాటారు.

బోనాల పండుగలో పురుషులు కూడా ఇలా ఉత్సాహంగా కనిపించారు. ఫ్యామిలీ పిక్నిక్ ఓ సామూహిక ఆనందాన్ని పంచింది.

అందంగా అలంకరించిన బోనాల్ని ఎత్తుకొని ఎన్నారై ఆడపడచులు అమ్మోరుని అత్యంత భక్తి భావాలతో పూజించుకున్నారు.

కేవలం బోనాలను ఉల్లాసంగా జరుపుకోవడమే కాకుండా దాని సాంస్కృతిక ప్రాధాన్యాన్ని, దాని మూలాలను కూడా వివరించారు.

అమ్మోరుకు భక్తిభావంతో పురుషులు కూడా ఇలా పూజలు చేశారు. సంస్కృతీసంప్రదాయాలకు అద్దం పడుతూ కనిపించారు.

బోనాల తల్లికి పండ్లు పుష్పాలు సమర్పించి, విచ్చేసిన వారందరికీ శుభాకాంక్షలు తెలియజేసి, వారి పిల్లలకుపండుగ ప్రాముఖ్యత వివరించారు.

సంస్కృతీ సంప్రదాయాలను వివరించే విధంగా ఏర్పాట్లు చేశారు. ఇలా దాని ఔన్నత్యానికి సిన్సినాటి ఎన్నారైలు అద్దం పట్టారు.

రుచికరమైన వంటలను, పానీయాలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన సిన్సిన్నాటి లోని పెద్దలు బోనాల తల్లికి పండ్లు పుష్పాలు సమర్పించి, విచ్చేసిన వారందరికీ శుభాకాంక్షలు తెలియజేసి, వారి పిల్లలకుపండుగ ప్రాముఖ్యత వివరించారు.

సుమారు నూట యాబైమంది పాల్గొన్న ఈ రెండవ ఏడాది"సిన్సినాటిబోనాల పండుగ" అత్యంత వైభావంగా జరిగింది.












Click it and Unblock the Notifications