చికాగోలో తెలంగాణ వేడుకలు

సరిత జలం, మృదుల కటంగూరు సహకారంతో లీడ్ యాంకర్ రవి తోకల కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలంగాణ తల్లి చిత్రంతో కూడిన వరంగల్ ద్వారంతో వేదికను అలంకరించారు. జయ జయహే తెలంగాణ జననీ జయ కేతనం పాటతో వేడుకలు ప్రారంభమయ్యాయి. ఈ పాటకు ప్రతి ఒక్కరూ గొంతు కలిపారు. లాలాగుడా లంబాడీ పిల్లా వంటి గిరిజన గీతాలతో, బండెనుక బండి కట్టి వంటి గద్దర్ పాటలతో గాయకులు అలరించారు. కొన్ని పాటలకు పిల్లలు ప్రదర్సనలు ఇచ్చారు. చిటా వాలంటీర్లకు ట్రోఫీలు ప్రదానం చేశారు. వేసవిలో నిర్వహించే చిటా వైద్య శిబిరం గురించి, చికాగో బతుకమ్మ ఉత్సవం గురించి సభలో ప్రకటన చేశారు.
చికాగో నైట్ 2013ను విజయవంతం చేయడంలో శ్రీరాములు పసికంటి, మనోజ్ కోడం, మహిపాల్ వి, ప్రకాష్ జలగం, విఠల్ కుమార్, సరిత జలగం, లక్ష్మి యెల్లంకి, ప్రదీప్ వి దామిడి, వెంకట్ జువ్వాది, శరత్ పున్రెడ్డి, రవి తోకల, వి. కిషన్ రెడ్డి, శ్రీనివాస్ ఓరుగంటి, శ్రీధఱ్ రాజు, ప్రవీణ్ కటకం, శ్రీని పాల్తెపు, పూర్ణచందర్ అల్లంనేని,తిరుమల్ నెల్లుట్ల, శ్రీని గౌడ్ బొడిగె, శరత్ కల్వకోట, కృష్ణ రంగరాజు, పవన్ వెంపటి, వేణు చల్లగొండ, రాజ్ యేముల, వెంకట్ తుడి, సతీష్ సుంకనపల్లి, రమేష్ అవధానుల విశేష కృషి సలిపారు.












Click it and Unblock the Notifications