ఎన్నారైలకు ఫ్యామిలీ హెల్ప్‌లైన్
వాషింగ్టన్: అమెరికా రాజధాని ప్రాంతంలో నివసించే తెలుగు వారికి ఉగాది పండుగ సందర్భంగా కాట్స్ వారి కానుకగా " ఫ్యామిలి హెల్ప్ లైన్ సేవా కార్యక్రమాన్ని ప్రకటించారు. రాజధాని ప్రాంతంలో నివసించే తెలుగు వైద్యులు , న్యాయవాదులు , తెలుగు సామాజిక పెద్దలు ‘ఫ్యామిలి హెల్ప్ లైన్" కూటమిలో సభ్యులు . సహాయము కావలసిన తెలుగు వారు " ఫ్యామిలి హెల్ప్ లైన్ " - 1-800-274-1242 or [email protected] సంప్రదించవచ్చు.
విజయ నామ సంవత్సర ఉగాది సంబరాలు వాషింగ్టన్ డిసిలోని రూస్వేల్ట్ హై స్కూల్‌లో శనివారం ఏప్రిల్ 13 వ తేది ఘనంగా జరిగాయి. వేదికను తెలుగుతనం ఉట్టి పడేలా అలంకరించారు. విజయ నామ సంవత్సర పంచాంగ శ్రవణం సభికులను అలరించింది. అందరికీ రుచికరమైన ఉగాది పచ్చడి, పలహారాలు పంచారు. ఈ కార్యక్రమానికి స్థానికంగా ఉండే 1200 మంది ప్రవాసాంధ్రులు హాజరయ్యారు.

యువతీయువకులు, మహిళలు , పెద్దలు, పిల్లలు తెలుగు సాంప్రదాయ దుస్తులతో, ఉత్సాహంగా ఈ వేడుకల్లో పాల్గొన్నారు . 260 మంది స్థానిక తెలుగు పిల్లలతో, తెలుగు సాంప్రదాయ, జానపద పాటల నృత్యాలతో కన్నుల పండుగగా జరిగాయి. శంకరాభరణం, మంజు భార్గవి నృత్యము తో మైమరిపించినది. అందాల వర్ధమాన గాయని , సూపర్ సింగర్ గురు " సుమంగళి ", గాయకుడు, తెలుగు వాయిస్ అఫ్ అమెరికా " గోపీనాథ్ " ప్రత్యేక పాట లతో, ప్రేక్షకులను ఉర్రుతలూగించారు.
కాట్స్ అధ్యక్షుడు భువనేష్ బూజాల ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ కాట్స్ సంస్థ చేస్తున్న పలు సామాజిక కార్యక్రమాలను నివేదించారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడంలో ఎనలేని కృషి చేసిన కార్య నిర్వాహక సభ్యులు మధు కొల, ప్రవీణ్ కట్టంగూర్, శ్రీలేఖ రెడ్డి, అపర్ణ మట్టపల్లి, బద్రి చల్ల, భాస్కర్ బొమ్మా రెడ్డి, అమరేందర్ రెడ్డి బొజ్జ , వెంకట్ గుండ, సుధా రాణి, గోపాల్ నున్న, అనిల్ రెడ్డి, గౌడ్ రాంపురం, నరసింహ రెడ్డి, సత్యజిత్ రెడ్డి, ప్రసాద్ వేదటి, శ్రీధర్ బాణాల, ప్రసాద్ మట్టపల్లి, సుధాకర్ బచ్చు, హరీష్ కుమార్, సోమేశ్వర్, రాజి రెడ్డి , రాకేష్ , పద్మ లత, ఉమాకాంత్, వెంకట చిక్యల్, మహేశ్ చించోడ్, సుదర్షన్ దేవిరెడ్డి, బాబు గుమ్మడి , విశ్వమోహన్ రెడ్డి, ఈశ్వర్ మేడం, రఘు వెదిరె, కృష్ణ కటకం, విజయ్ తాళ్ళ, ప్రవీణ్ ఎర్రంరెడ్డి, చంద్ర చింతపర్తి, రామ్ మోహన్ కొండ, చిత్తరంజన్ నల్లు, నర్సింగ్ రావు, జ్యోతి, అనంతలక్ష్మి మొదలగు వారికి కృతజ్ఞతలు తెలియజేసారు. వర్ధమాన గాయని సుమంగళి జాతీయ గీతాలాపనతో , కాట్స్ ఉగాది వేడుకలు ఘనంగా ముగిసాయి.












Click it and Unblock the Notifications