స్పెల్లింగ్ బీ విజేతది హైదరాబాదే

Indian-American Arvind Mahankali wins National Spelling Bee
వాషింగ్టన్: అమెరికాలో యేటా నిర్వహించే స్పెల్లింగ్ బీ పోటీల్లో ఈ ఏడాది భారీతయ అమెరికన్ విద్యార్థి అరవింద్ మహంకాళి విజయం సాధించాడు. నిర్వాహకులు అడిగిన జర్మన్ పదం knaidel పదానికి తడబడకుండా అతను సమాధానం చెప్పాడు. దీంతో అతను విజేతగా నిలిచాడు. పోటీ నిర్వాహకులు అడిగిన ప్రశ్న కాస్తా కఠినంగా ఉన్నా తన మనస్సులోని ఆలోచనలు విజేతగా నిలువాలని ఉవ్విళ్లూరాయని మహంకాళి అన్నాడు. దీంతో తడుముకోకుండా సమాధానం చెప్పగలిగానని అన్నాడు.

న్యూయార్క్‌లో ఉంటున్న అరవింద్ మహంకాళి ప్రస్తుతం ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. కింగ్ ఆఫ్ ఆల్ సైన్సెస్‌గా పిలిచే ఫిజిక్స్‌లో తన భవిష్యత్తు అభివృద్ధికి ప్రణాళికలు వేసుకుంటున్నట్లు అతను చెప్పాడు. మూడు రోజుల క్రితం స్ల్పెల్లింగ్ బీ పోటీలు ప్రారంభమయ్యాయి. అయితే, తుది జాబితాలో 45 మంది విద్యార్థులకు చోటు దక్కింది. వారిలో 15 మంది భారతీయ విద్యార్థులే ఉండడం గమనార్హం.

గత ఆరేళ్లుగా ఈ పోటీల్లో భారతీయ విద్యార్థులు విజేతలుగా నిలుస్తున్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిపే ఈ పోటీలను అమెరికాలోని లక్షలాది మంది ఆసక్తిగా చూశారు. అరవింద్ పూర్వీకులది హైదరాబాదే. గతంలో రెండు సార్లు సెమీ ఫైనల్ దాకా వచ్చినా జర్మన్ నుంచి ఇంగ్లీషులోకి వచ్చిన పదలాకు సరిగా సమాధానం చెప్పలేక ఓటమి పాలయ్యాడు.

ఈసారి కూడా ఫైనల్లో చివరి ప్రశ్నగా జడ్జిలు జర్మన్ పదాన్నే సంధించారు. తికమక పెట్టే జర్మన్ పదానికి ఏ మాత్రం తడబడకుండా సరిగ్గా స్పెల్లింగ్ చెప్పి ట్రోఫీని గెలుచుకున్నాడు. దాంతో అతనికి ముప్పై వేల డాలర్ల ప్రైజ్ మనీ దక్కింది. గత పదిహేనేళ్లలో 11 సార్లు ఈ ట్రోఫీ ఇండియన్స్‌నే వరించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+