గర్ల్ మృతి: హత్యేనని తండ్రి ఆరోపణ

జార్జినా థామ్సన్ తన హాస్టల్ గదిలో ఉరేసుకుని మరణించినట్లు విశ్వవిద్యాలయం ప్రకటించింది. తన కూతురు మెడపై ఉరేసుకున్నట్లు ఏ విధమైన గుర్తులు లేవని చెన్నైలోని జెజె నగర్‌లో ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న అమ్మాయి తండ్రి ఎస్ థామ్సన్ అంటున్నారు.
తన కూతురు మరణవార్త వినగానే తాను బ్రిటన్ చేరుకున్నానని, తాను దర్యాప్తు చేశానని, తన కూతురు జూన్ 28 నుంచి జులై 11వ తేదీ వరకు హాస్టల్లో లేదని తెలిసిందని ఆయన అన్నారు. అంతర్జాతీయ విద్యార్థి కనిపించకుండా పోయినప్పుడు హాస్టల్ అధికారులు కుటుంబానికి గానీ యుకె బోర్డర్ ఏజెన్సీకి గానీ తెలియజేయాలనే నిబంధనలున్నాయని, వారు స్థానిక పోలీసు స్టేషన్‌కు సమాచారం ఇవ్వలేదని ఆయన అన్నారు.
తన కూతురు మృతదేహాన్ని రెండు రోజుల పాటు తనకు చూపించలేదని ఆయన అన్నారు. ఆమె మరణించిందని చెబుతున్న గదిలో ఫ్యాన్ గానీ ఐరన్ రాడ్ గానీ లేదని ఆయన చెప్పారు. జార్జినా రాసిందని చెబుతున్న లేఖను తనకు ఇవ్వడం లేదని ఆయన అన్నారు. జార్జినా మృతిపై ఏ విధమైన అనుమానాలు లేవని విశ్వవిద్యాలయం అధికారులు అంటున్నారు.












Click it and Unblock the Notifications