లైంగిక దాడి: క్యాబ్ డ్రైవర్‌కు జైలు

టాక్సీ డ్రైవర్‌ను 30 ఏళ్ల ఎం శరవణన్‌గా గుర్తించారు. అతనికి కోర్టు 12 ఏళ్ల జైలు శిక్ష విధించింది. తనతో ముఖరతి చేయాలని ఒత్తిడి చేసినందుకు అతనికి మూడు శిక్షలను విధించాలని కోర్టు అధికారులను ఆదేశించింది. అతనికి మరో రెండు అదనపు జైలు శిక్షలను సెషన్స్ కోర్టు విధించింది. మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించినందుకు ఐదేళ్లు, దోపిడీ చేసినందుకు ఐడేళ్లు జైలు శిక్ష పడింది.
టాక్సీ డ్రైవర్ చేసిన నేరం దేశ ప్రతిష్టపై వ్యతిరేక ప్రభావం చూపుతుందని, ప్రత్యేకంగా పర్యాటక పరిశ్రమపై వ్యతిరేక ప్రభావం పడుతుందని కోర్టు వ్యాఖ్యానించింది. జైలు శిక్ష విధించే ముందు తన క్లయింట్ నేపథ్యాన్ని పరిగణనలోకి తీసుకోవాలని శరవణన్ తరఫు న్యాయవాది కోర్టును కోరారు.
శరవణన్ నిరుపేద కుటుంబం నుంచి వచ్చాడని, ఏడేళ్ల విద్య మాత్రమే అభ్యసించాడని చెప్పుకున్నారు. ఆ విధమైన చర్యకు పాల్పడకూడదని చదువుకున్న విద్య అతనికి సరిపోతుందని డిప్యూటీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ టాన్ గిన్ హాన్ వాదించారు. ఈ వాదనతో న్యాయమూర్తి ఏకీభవించారు.












Click it and Unblock the Notifications