కండలు పెంచాలని ప్రాణాలు తీసుకున్నాడు

కొవ్వును కరిగించే ప్రమాదకర 'డీఎన్‌పీ' ట్యాబ్లెట్ల గురించి విపరీతంగా పొగుడుతూ, తన కండలను ప్రదర్శిస్తూ దిగిన ఫొటోలను ఫేస్‌బుక్‌లో పెట్టాడు. తర్వాత కొద్దిసేపటికే ఆ ట్యాబ్లెట్లు వేసుకుని అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయాడు. వెంటనే అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించినప్పటికీ ఉపయోగం లేకపోయింది.
అయితే, అతడు అలాంటి మందులను వేసుకునే తరహా వ్యక్తి కాదని, ఇదంతా అనుమానాస్పదంగా ఉందని సర్మద్ స్నేహితుడొకరు అన్నట్టు సన్ పత్రిక ఒక కథనంలో చెప్పింది. ఇలా ప్రమాదకరమైన బరువు తగ్గించే, బాడి బిల్డింగ్ ఔషధాలను విద్యార్థులు వాడుతున్నట్టు తమ పరిశీలనలోకి వచ్చిందని, ఆన్‌లైన్‌లోగానీ, ఇతరత్రా మార్గాల ద్వారా డినిట్రోఫెనాల్ లేదా డైమెటాడ్రిన్ మందులను ఎవరైనా వాడుతున్నట్లైతే వెంటనే వాటిని ఆపేయాలని, అవి ప్రాణాంతక ఔషధాలని యూనివర్సిటీ కిందటి వారమే విద్యార్థులను హెచ్చరించింది.
సర్మద్ కేసును నమోదు చేసుకున్న సర్రే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 18 ఏళ్ల నర్మద్ తీవ్ర విషాదాన్ని నింపింది.












Click it and Unblock the Notifications