పనిమనిషిపై అసభ్యంగా, జైలుశిక్ష

 Indian in UAE to be jailed, deported for molesting maid
దుబాయ్: శ్రీలంకకు చెందిన పనిమనిషి పట్ల అసభ్యంగా ప్రవర్తించినందుకుగాను ఓ భారతీయుడికి దుబాయ్ కోర్టు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. అతనికి బహిష్కారం కూడా విధించింది. ఆ సంఘటన ఫిబ్రవరిలో జరిగింది.

ప్రాసిక్యూషన్ రికార్డుల ప్రకారం - భారతదేశానికి చెందిన కార్మికుడు పని మనిషి ఉండే విల్లాకు వెళ్లాడు. తలుపులు తట్టాడు. ఆమె తలుపులు తీయగానే ఇంట్లోకి చొరబడి ఆమెను ముద్దు పెట్టుకోవడం ప్రారంభించాడని ఖలీజ్ టైమ్స్ రాసింది.

అతనిపై అసభ్యంగా ప్రవర్తించినందుకు, ఇంట్లోకి అక్రమంగా చొరబడినందుకు అభియోగాలు మోపారు. సంఘటనకు ముందు ఆ వ్యక్తి తనకు తెలియదని పని మనిషి ప్రాసిక్యూషన్ దర్యాప్తులో చెప్పింది. నిందితుడు ఆమెను వెంబడించి, పట్టుకుని, కౌగలించుకున్నాడు.

అతను తాగి ఉన్నట్లు వాసన వచ్చిందని బాధితురాలు చెప్పింది. బాధితారులు నిందితుడి నుంచి తప్పించుకోవడానికి తన గదిలోకి పరుగులు తీసిందని మరో శ్రీలంక పనిమనిషి చెప్పింది. ఈ తీర్పుపై 30 రోజుల్లోగా కోర్ట్ ఆఫ్ కాసేషన్‌లో అపీల్ చేసుకోవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+