లండన్‌లో ఇంకెన్నాళ్లు డివిడి విడుదల

సినిమా విడుదలకు అడ్డంకులు ఎదురైనా, ఆర్థికంగా నష్టపోయినా, సినిమాని కేబుల్ టీవీ, సోషల్ మీడియా ద్వార తన లక్ష్యం సాధించినందుకు సంతోషంగా ఉందని రఫీ తెలిపారు. సినీ పరిశ్రమ లో తెలంగాణ స్థిరపడే పరిస్థితులు ఇప్పుడిప్పుడే ఏర్పడుతున్నాయని ఆయన అన్నారు.
తెలంగాణా వాళ్లు సినిమా పరిశ్రమతో పాటు అన్ని పరిశ్రమల్లో ఉన్నత స్థాయికి చేర్చే బాద్యత తెలంగాణ ప్రజలదేనని తెలంగాణ ఎన్నారై ఫోరం వ్యవస్థాపక సభ్యుడు చెప్పారు. రఫీ శ్రమ వెల కట్ట లేనిదని , సినిమాకి నంది అవార్డు రావడం అబినందనీయమని ఆయన అన్నారు.
సినిమా తెలంగాణా ఉద్యమానికి ఎంతో ఉపయోగపడ్డదని , సినీ పరిశ్ర లో మనం నిలదొక్కు కోవడడం సీమాంధ్రులకున ఇష్టం లేదని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) ఎన్నారై విభాగం అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం అన్నారు. తెలంగాణా ఏర్పాటు జరిగితేనే సమస్యలను అన్నింటిని అధిగమించగలమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో రంగుల సుధాకర్, వెంకట్ రంగు, ప్రమోద్, అశోక్ గౌడ్, మహేష్ పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications