అమెరికాలో జడ్జిగా ఇండియన్ అమెరికన్!

ప్రస్తుతం యూఎస్ ప్రిన్సిపల్ డిప్యూటీ సొలిసిటర్ జనరల్‌గా శ్రీకాంత్ వ్యవహరిస్తున్నారు. ఆయన పేరు దాదాపు ఖరారైంది. వాషింగ్టన్‌లో బుధవారం జరిగిన సెనేట్ న్యాయవ్యవస్థ కమిటీ సమావేశంలో విపక్ష రిపబ్లికన్ సెనేటర్లు సైతం శ్రీనివాసన్ నియామకంపై ఏకాభిప్రాయం వ్యక్తం చేసిందని సమాచారం.
దేశాధ్యక్షుడు బరాక్ ఒబామా మార్గదర్శకుడుగా పిలిచే శ్రీనివాసన్ నియామకం ఖరారైతే అమెరికాలో మొత్తం మీద ఏ ఫెడరల్ జడ్జి పదవికైనా ఎంపికైన దక్షిణాసియా వ్యక్తి అవుతారు. పంజాబ్‌లోని చండీగఢ్‌లో పుట్టిన శ్రీనివాసన్ అమెరికాలోని కాన్సస్‌లో పెరిగి విద్యాభ్యాసం పూర్తి చేశారు.












Click it and Unblock the Notifications