లండన్ రోడ్లపై కెసిఆర్ పేరు హల్‌చల్
లండన్: సెలిబ్రిటీల పేరుతో కారు నెంబర్లను తీసుకోవడం ఇటీవలి కాలంలో ఫ్యాషన్‌గా మారిపోయింది. అమెరికాలో ఇది సర్వసాధారణం. అమెరికాలో తమ కార్లకు చాలా మంది ఫిల్మ్ టైటిల్ నెంబర్ ప్లేట్ల కోసం పాకులాడుతారు. అయితే, లండన్‌లో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు పేరు ఫ్యాషన్‌గా మారింది. లండన్‌లో కెసిఆర్ పేరుతో ఉన్న నెంబర్ ప్లేటుతో హంగామా చేస్తోంది.
పుష్కర కాలాన్ని విజయవంతంగా ముగించుకొని తెరాస 13వ వసంతంలోకి అడుగుపెడ్తున్న సందర్భంగా లండన్ లో నివసిస్తున్న ఎన్నారై తెరాస విభాగం అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం - పార్టీ పట్ల, తెరాస అధినేత కెసిఆర్ పట్ల ఉన్న అభిమానాన్ని చాటుకోవడానికి నెంబర్ ప్లేటును వాడుకుంటున్నారు.

తన కొత్త బిఎండబ్ల్యు కారుకు కూర్మాచలం "TRS KCR " అని అర్ధం వచ్చేలాగ "TR55 KCR " అనే నెంబర్ ప్లేటు తీసుకుని యుకె రోడ్లపై హల్‌చల్ చేస్తున్నారు. ఫేస్‌బుక్ లో ఎక్కువ లైక్‌లతోదీనికి మంచి ఆదరణ లభిస్తోంది. అలాగే తెరాస అభిమానులు నాయకులు కూడా హర్షం వ్యక్తం చేశారు.
అనిల్ కూర్మాచలం లండన్‌లో తెలంగాణ సాధన కోసం తరుచుగా సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇతర ప్రాంతాల్లో కూడా తెరాస ఎన్నారై విభాగాలను ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా ఇటీవల సింగపూర్ తెరాస ఎన్నారై విభాగం ఏర్పడింది. దీంతో ఆయన కెసిఆర్ వద్ద మంచి మార్కులు కొట్టేసే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications