బాలీవుడ్ యాక్టర్ విక్రమ్ అరెస్ట్

కొకైన్, వీడ్, హెరాయిన్ వంటి డ్రగ్స్ అతని సంచీలో లభించినట్లు అధికారులు చెప్పారు. ఈ సమయంలో తాము ఆ సంఘటనపై ఏమీ చెప్పలేమని పిటిఐ వార్తా సంస్థ సంప్రదించినప్పుడు సంత్ ఛత్వాల్ ఆధ్వర్యంలోని హాంఫ్‌షైర్ హోటల్స్ అండ్ రిసార్ట్స్ ప్రెస్ ఆఫీస్ వ్యాఖ్యానించింది. ఛత్వాల్ ఇంకా ఫ్లోరిడాలోనే ఉన్నాడా అనే విషయంపై కూడా మాట్లాడడానికి నిరాకరించింది.
తాను డ్రగ్స్‌ను అక్రమంగా కొనుగోలు చేసి, తన వద్ద పెట్టుకున్నట్లు ఛత్వాల్ పోలీసుల వద్ద అంగీకరించినట్లు టిఎంజి తెలిపింది. తమ వద్ద పోలీసు రిపోర్టు ఉన్నట్లు చెప్పుకుంది. పీపుల్ మ్యాగజైన్ తన వెబ్‌సైట్‌లో ఛత్వాల్ అరెస్టు గురించి రాసింది.
ఛత్వాల్ వయస్సు 41 ఏళ్లు. డ్రీమ్ హోటల్ యజమాని అయిన ఛత్వాల్ కొన్ని భారతీయ సినిమాల్లో నటించారు కూడా.












Click it and Unblock the Notifications