రోశయ్యతో ఎన్నారై భేటీ

రోశయ్యకు దుబాయ్ వాసవి యూత్ క్లబ్ తరఫున వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలను తెలిపారు. అలాగే తమిళనాడు గవర్నర్‌గా నియమితులైన సందర్భాన్ని పురస్కరించుకుని ప్రత్యెక శుభాకాంక్షలను తెలిపారు.
దుబాయ్ వాసవి యూత్ క్లబ్ వారు ఆర్య వైశ్య యువత కోసం జాతీయంగా , అంతర్జాతీయంగా నిర్వహిస్తోన్న కార్యక్రమాలను తెలుసుకొని రోశయ్య అభినందించారు. ఇటువంటి సేవను మరింత విస్తృత పరచేందుకు రోశయ్య తగిన సలహాలు ఇచ్చినట్లు సురేష్ తెలిపారు.
దుబాయ్ వాసవి యూత్ క్లబ్ తఫున నిర్వహించబోయే భవిష్యత్తు కార్యక్రమాలకు సురేష్ రోశయ్యను ఆహ్వానించారు. అందుకు రోశయ్య నుండి సానుకూల స్పందన వచ్చిందని తెలిపారు.












Click it and Unblock the Notifications