• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

డల్లాస్‌లో భోగి మంటలు

By Pratap
|
 NRIs celebrate Bhogi at Dallas
డల్లాస్: ఇటీవల సంక్రాంతి సందర్భంగా అమెరికా డల్లాస్‌లోని ప్రవాసాంధ్రులు స్థానిక బొర్రా ఫార్మ్స్ లో వైభోగంగా భోగి మంటలతో మకర సంక్రమణాన్ని జరుపుకున్నారు. భారతదేశంలో పండుగలు చేసుకోడానికి, విదేశాలలో పండుగలు చేసుకోడానికి చాలా తేడా ఉంది. మాతృదేశం నుండి దూరం గా విదేశాలలో ఉన్న ప్రవాసులు ఈ మధ్య భారతదేశం లో లాగానే అన్ని పండుగలు వారాంతాల్లో స్నేహితులతో కలిసి మెలిసి కుటుంబసమేతం గా చేసుకుంటున్న సంగతి మనందరికి తెలిసిందే! ఎంత ప్రయత్నించినా కొన్ని పండుగలు మాత్రం భారతదేశం లో లాగా చేసుకోలేని పరిస్తితి విదేశాలలో ఉంది.

అమెరికా లో దీపావళి మందులు కాల్చడం, భోగి మంటలు వేయడం అనేక అనుమతులు, ముందు జాగ్రత్తలతో కూడుకున్న విషయం. చాలా ప్రాంతాలలో నిషిద్దం, కష్టం. అయితే ఈ కష్టాలను లక్ష్యపెట్టకుండా, డల్లాస్ లో ఈసారి భోగి పండుగ చేసుకోవాలని సంకల్పించి, డల్లాస్‌ కు చెందిన బొర్రా సోదరులు విజయ్, రవి తమ సొంత ఫార్మ్ లో భోగి మంటలను, ఆంధ్ర షడ్రుచుల వంటలను ఏర్పాటు చేసి వారిఊరికి సంక్రాంతి శోభను కలిగించారు.

దాదాపు 100 తెలుగు కుటుంబాలు డల్లాస్ సమీపంలోని మేలిస్సా లో గల బొర్రా ఫార్మ్స్‌లో శనివారం వేకువ జామున, చలిని లెక్క చేయకుండా, పొగమంచు చాటున సమావేశమై, నిలువెత్తు భోగి మంటను వెలిగించారు.

ఎప్పుడో తమ చిన్నప్పుడు పల్లెటూళ్ళలో, వీధుల్లో స్నేహితులందరితో కలిసి చేసుకున్న పండుగను జ్ఞప్తికి తెచ్చుకున్నారు. ఒకరికొకరు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. పెద్దలతోపాటు శీతాకాలం తెల్లవారుఝాము చలిలో భోగిమంటల మజా మొదటి సారి చవిచూసిన పిల్లలు ఈ కార్యక్రమం లో రెట్టించిన ఉత్సాహంతో పాల్గొన్నారు.

గారెలు, అరిశెలు, పులిహోర, మొదలైన అనేక తెలుగు వంటకాలతో విందులు, మగువలు తీర్చిదిద్దిన వన్నెవన్నెల రంగవల్లులు, సంక్రాంతిపాటలు ఆటలు వినోదాలతో ఎంతో ఆహ్లాదంగా సాగిన ఈవేడుకను ఏర్పాటు చేసిన బొర్రా బ్రదర్స్ కు అందరూ అభినందనలు తెలియజేశారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary

 Telugu NRIs have celebrated Sankranthi at Borra farms in Dallas of USA. About 100 NRIs participated in the celebrations.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more