'చలో అసెంబ్లీ' పై ఎన్నారైల వ్యాఖ్యలు

గంప వేణుగోపాల్ : ఇది తెలంగాణా ప్రజల విజయం, త్యాగాల ఫలాలు అందే సమయం దగ్గరలోనే ఉంది . ఎవ్వరు ఆత్మహత్యలకు పాల్పడకండి.
అనిల్ కూర్మాచలం :"ఛలో అసెంబ్లీ" విజయానికి తెగించి పోరాటం చేసిన ప్రతి తెలంగాణ బిడ్డకు, నాయకులకు ఉద్యమాభివందనలు. ఈ రోజు సీమాంధ్ర సర్కార్ అనుసరించిన తీరు ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు లాంటిది.
సిక్క చందు గౌడ్ : శాంతియుత ఉద్యమాన్ని తుపాకీ గుండ్లు ఆపలేవని రుజువైంది. తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు తథ్యం.
ఉదయ్ నాగరాజు : కనువిప్పు కలిగేలా విజవంతమైంది. శాంతిభద్రతల విషయంలో సర్కారు విఫలం అయింది.
పవిత్ర రెడ్డి : విజయవంతం చేసిన తెలంగాణా బిడ్డలకి అభినందనలు.
సుధాకర్ రంగుల : లండన్‌లో ఉండి ప్రత్యక్షంగా చలో అసెంబ్లీ కార్యక్రమంలో పాల్గొనలేకపోయినందుకు బాధపడుతున్నాను. ఢిల్లీ కదిలేలా విజయవంతం చేసిన అందరికి వందనాలు.
శ్రీకాంత్ రెడ్డి రాజు :''చలో అసెంబ్లీ'' లో పాల్గొన్న ప్రతి తెలంగాణా బిడ్డకి పాదాభివందనాలు .
శ్యాం కుమార్ పిట్ల : టి- జాక్ -''చలో అసెంబ్లీ '' లో పాల్గొన్న అందరికి అభినందనలు. తెలంగాణా ఏర్పాటు ఎంతో దూరం లేదు. శాంతి యుతంగా సాధించుకునే దశకి చేరాం
శివాజీ షిండే : సర్కారు ఉద్యమాన్ని అణిచి వేసేందుకు పన్నిన అన్ని కుట్రలు తిప్పి కొట్టి విజయం సాధించాం
దూసరి అశోక్ : ఎన్ని అడ్డంకులు ఏర్పడినా ఛేదించి విజయవంతం చేసిన అందరికి కృతజ్ఞతలు .
రంగు వెంకట్ : సక్సెస్స్ ను చూసి సీమ ఆంధ్ర నేతలు భయపడ్డారు.
ప్రమోద్: ఉద్యమ వేడి ఢిల్లీకి తగిలేల జరిగింది, ఇక రాష్ట్ర ఏర్పాటే తరువాయి.
సతీష్ మాదారపు : నేను బహరేన్‌లో ఉన్నందున పాల్గొనలేక పోయాను. కాని నా తమ్ముని పంపించడం ద్వార టి -జాక్ ఇచ్చిన ఇంటికొకరు లో నేను కూడా బాగస్వామి అయ్యాను.
దుద్దిళ్ళ నటరాజ్ : గ్రాండ్ సక్సెస్ చేసిన అందరకి అభినదనలు. నేను స్విట్జర్లాండ్‌లో ఉన్నాను. ప్రచార సాధనాల ద్వార పోలిసుల జులుం చూసి బాధ వేసింది. మనో, తిరుపతి, నగేష్, అర్చన, హరి, వెంకట్, వంశీరెడ్డి కూడా చలో అసెంబ్లీని విజయవంతం చేసిన అందరికి తెలిపారు. చలో అసెంబ్లీని విజయవంతం చేసినందుకు టీ - జాక్‌కు, తెలంగాణవాదులకు తెలంగాణ ఎన్నారై ఫోరం అభినందనలు తెలిపింది.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications