మెగా కన్వెన్షన్‌కు తానా ఏర్పాట్లు

TANA is getting ready for the mega 19th TANA Convention
డల్లాస్: ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) 19వ మహాసభల కోసం ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా ఇర్వింగ్ టెక్సాస్ ప్రసాద్ ఇండియన్ రెస్టారెంట్‌లో సమ్మేళనం జరిగింది. తానా అధ్యక్షుడు ప్రసాద్ తోటకూర, మహాసభల సమన్వయకర్త మురళి వెన్నం నాయకత్వంలో ఈ సమ్మేళనం జరిగింది. మే 24 నుంచి 26వ తేదీ వరకు డల్లాస్ కన్వెన్షన్ సెంటర్‌లో భారీ యెత్తున తానా 19వ మహాసభలు జరగనున్నాయి.

మహాసభలు తెలుగు ప్రజలందరినీ ఒకే గొడుగు కిందికి తేగలవని, వారికి సేవలందించే క్రమంలో అది జరుగుతుందని, సహోదర స్పూర్తిని అందిస్తూ ముందుకు సాగుతుందని, ఇదే విజయానికి తోడ్పడుతుందని కన్వెన్షన్ అడ్వయిజరీ బోర్డు చైర్మన్ డాక్ట్రర్ రాఘవేంద్ర ప్రసాద్ అన్నారు.

ముప్పై మంది నిబద్ధులైన నాయకులను మురళీ వెన్నం పరిచయం చేశారు. మహాసభలకు ప్రపంచమంతటి నుంచి పది వేల మందికి పైగా రాగలరని అంచనా వేస్తున్నట్లు, అందుకు తగినట్లుగా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

అమెరికాలోని వివిధ ప్రాంతాల్లో విరాళాల సేకరణ జరుగుతున్న తీరును కన్వెన్షన్ కార్యదర్శి చలపతి కొండ్రకుంట వివరించారు. అత్యధిక శాశ్వత సభ్యులున్న ఈ ప్రాంతంలో కన్వెన్షన్ జరగడం గర్వంగా ఉందని సౌత్‌వెస్ట్ ప్రాంతీయ ప్రతినిధి మంజులత కన్నెగంటి అన్నారు.

ప్రపంచానికి తెలుగు వైభవాన్ని చాటి చెప్పడానికి తమ మహాసభలు ఏ విధంగా ఉంటాయనే విషయాన్ని ప్రసాద్ తోటకూర వివరించారు. ఈ సందర్భంగా కన్వెన్షన్ వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. ప్రసాద్ తోటకూర, డాక్టర్ రాఘవేంద్ర ప్రసాద్, మురళీ వెన్నం, చలపతి కొండ్రకుంట, వెబ్ కమిటీ చైర్ రాజేష్ వీరపనేని ఈ వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. ఐదు నిమిషాల నిడివి గల లఘు చిత్రాల నిర్మాణాన్ని ప్రసాద్ తోటకూర ఆహ్వానించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+