అమెరికాలో వెంకటేశ్వర కళ్యాణం
కాలిఫోర్నియా: దక్షిణాది కాలిఫోర్నియా సంఘం (టిఎఎస్‌సి) ప్రారంభోత్సవం సందర్భంగా ఇర్విన్ మందిరంలో ఈ నెల 19వ తేదీన వెంకటేశ్వర కళ్యాణం నిర్వహించారు. సంఘం నూతన అధ్యక్షుడు నాగేశ్వర రావు తన జట్టు సభ్యులతో కలిసి వెంకటేశ్వర స్వామికి అర్చన చేశారు. టిఎఎస్‌సి మద్దతుదారులు 200 మందికిపైగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
తమ కార్యక్రమాలను ప్రారంభించడానికి, ఈ ఏడాదిలో విజయవంతంగా పనిచేయడానికి ఆశీస్సులు కోరుతూ పూజను నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాలయంలో పండుగ వాతావరణం నెలకొంది. అతిథులను ఆహ్వానించి, వారిని త్రివర్ణాల శాలువాలతో సత్కరించి, టిఎఎస్‌సి బ్యాడ్డీలను అధ్యక్షుడు నాగేశ్వర రావు ప్రదానం చేశారు. సంప్రదాయ పద్ధతిలో ఇతర కుటుంబాలతో కలిసి ఆయన పూజ నిర్వహించారు. వేంకటేశ్వర స్వామి కళ్యాణం నిర్వహించడంతో పల్లకీ సేవను కూడా నిర్వహించారు.

ఈ పూజా కార్యక్రమానికి హాజరై విజయవంతం చేసినందుకు నాగేశ్వర రావు ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. తెలుగు సమాజానికి సేవ చేసే అవకాశం ఇచ్చినందుకు ఆయన అందరికీ తన అభినందనలు తెలిపారు. కమ్యూనిటీ సేవకు తాను తగిన ప్రాధాన్యం ఇస్తానని ఆయన చెప్పారు. తమకు అంకిత భావంతో కూడిన స్వచ్ఛంద సేవకులు ఉన్నారని ఆయన చెప్పారు.
తమకు అవసరమైన సమాచారాన్ని అందించాలని ఆయన కోరారు. స్థానిక తెలుగు ప్రజలు తమ సంఘంలో చేరి, కార్యక్రమంలో చురుగ్గా పాల్గొనాలని ఆయన అన్నారు. శ్రీమతి, శ్రీ చెంచయ్య బతాల, శ్రీమతి, శ్రీ పాండురంగం ముత్యాలలకు, కీలకమైన ఆర్గనైజర్స్ ప్రసాద్ రాణి, మల్లికార్జున్ బొంతు, బయ్యపు రెడ్డి, రత్నారెడ్డి, వీరా రెడ్డి, సీతారాం, జైపాల్, వేణు కుటుకూరి, వీరబాబు, విజయ్, హరితా కూచిభొట్ల, భారతి నాయుడు, నారాయణ రావు, రాధికా చౌదరి, సీతా కౌలూరి, కోటిరెడ్డి, అమర్, కృష్ణ, నరేష్ ములకల, గిరిబాబు, అరవింద్ రెడ్డి, శ్రీకాంత్ వట్టిపల్లి, నరేంద్ర, బాలాజీ, గణేష్, గంగ, దీపక్, వెంకట్‌లకు ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.












Click it and Unblock the Notifications