అమెరికాలో తెలంగాణ వైభవం (పిక్చర్స్)

ఫిలడెల్ఫియా: ఫిలడెల్ఫియా తెలంగాణ సంఘం (పిటిఎ) ఆధ్వర్యంలో ఈ నెల 18వ తేదీన అత్యంత వైభవంగా జరిగింది. దాదాపు 400 మంది తమ పిల్లాపాపలతో ఈ కార్యక్రమానికి విచ్చేశారు. తెలంగాణ సాంస్కృతిక విశిష్టతకు ఈ కార్యక్రమం అద్దం పట్టింది. సంప్రదాయబద్దమైన పంచె, కుర్తా ధరించి పిటిఎ కోర్ కమిటీ సభ్యులు ఆహ్వానం పలికారు. పప్పు పచ్చిపులుసు, కోడికూర, డబుల్ కా మీటా వంటి తెలంగాణ వంటకాలను ఈ కార్యక్రమంలో అందించారు.

ఆర్టిస్టు వెంకటరమణ నెల్లుట్ల రూపొందించిన తెలంగామ ప్రముఖుల చిత్రాలను శ్రీధర్ గుడాల ప్రదర్శించారు. ఈ చిత్ర ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంది. పవన్ తిరునహరి స్వాగతం పలికారు. సాంస్కృతిక ప్రదర్సనలను యాంకర్ లీనా కొల్లూరు, మాధవి కమతాల, నిష్టా వెంకన్నగారి, చిత్రా మోసర్ల, సమీర్ షేక్, ప్రియాంక బైరెడ్డి సమన్వయం చేశారు. పిల్లలు తమ గీతాలాపనలతో, నృత్యప్రదర్శనలతో అలరించారు. మనబడి పిల్లలు హాస్యరసభరితమైన రేడియో జిలేబీని ప్రదర్శించారు.

గత తెలంగాణ నైట్ నుంచి ఇప్పటి వరకు తాము నిర్వహించిన కార్యక్రమాల గురించి పిటిఎకు చెందిన సుధీర్ రాజు వివరించారు. ప్రతి నెలలో ప్రతి జిల్లాలో గ్రామీణ పాఠశాలల అభివృద్ధికి తాము చూపుతున్న చొరవను ఆయన చెప్పారు. టిడిఎఫ్‌, తెలంగాణ ఎన్నారై అసోసియేషన్ (తెనా), టిజిడివి, ఆటా, తానా, నాటా, నాట్స్, చిన్మయ మిషన్, శ్రేయోభిలాషి సంస్థల ప్రతినిధులను వేదికపైకి ఆహ్వానించారు.

సావనీర్ మ్యాగజైన్ సింగిడిని ముఖ్య అథితి చందా రాములు, తదితరులు ఆవిష్కరించారు. రంగుల సావనీర్‌ను తేవడానికి పిటిఎ సభ్యులు సుమంత్ గరకురాజుల, ముజీబుర్ రెహ్మాన్ విశేషంగా కృషి చేశారు. మాధవ మోసరల్, పవన్ తిరునహరి, రమేష్ కంకటి ఇచ్చిన అందమైన నృత్యప్రదర్శన అందరినీ అలరించింది. పేద విద్యార్థుల విద్యకు తాము అందిస్తున్న సహాయాన్ని సంగారెడ్డి పాపగారి వివరించారు.

కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో నీహారిక బైరెడ్డి, నిత్యా వనచర్ల, నిధి నాగముల్లా, మాన్య మొలిగి, చైత్ర మొలిగి, సానవి, హంస, మేఘ, శ్రీష్ గూడాల, తన్వీ పాపగారి, సమీక్ష కంకటి, శశాంక్ కొంకటి, తనవ్ తోట, మీరా మేరెడ్డి, ప్రమిత మిట్టల్, నేహా సింగ్, ప్రియాంశు దూబే, సదాంశీ మామిడి, సాకేత్, సిద్ధార్థ్ మడిపడగ, ముకుంద్ తిరునహరి, నమందిని, మహాలక్ష్మి చెలుక, హర్షిణి, శరీత నెల్లుట్ల, శ్రీజ వనచర్ల, మేఘన దాచపల్లి, మహిత శీలం, సమీర సింగిరికొండ, యషిత తోట, సింధు ముద్దసాని, హారిక, శ్రీహిత మొదలి, శ్రీయాంశు నెల్లుట్ల, శ్రీయాంశు రెడ్డి తాడూరి, రిషి కమతం, దివ్యేష్ గబ్బిరెడ్డి, శ్రీకర్ భూమిరెడ్డి, వినీత్ గబ్బిరెడ్డి, సింధు దాసరి, అడవి గట్టు, అనుష్క గట్టు, సమీర్ షేక్, యషిత తోట, సిద్ధార్థ్, సాకేత్, శ్రీత, తేజ్ రామచంద్రుల, వివేక్ ఇనుమెల్ల, నికిత జక్కం, నిషిత జక్కం, శ్రీయ ఇనుమెల్ల అనురాగ్ అంకటి విశేషంగా కృషి చేశారు.

వేణు, రాజ్ మామిడి, శ్రవంత్ పోరెడ్డి, అను మిట్టల్, పరిమళ సింగ్, భాను రేఖ, గీతా వొగ్గు, శ్రీదేవి తాళ్లూరు, మనీషా ద్వివేది తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

 అమెరికా తెలంగాణ వైభవం (పిక్చర్స్)

తెలంగాణ సాంస్కృతిక ఉత్సవంలో పిల్లలు ఇలా నృత్యం చేస్తూ..

 అమెరికా తెలంగాణ వైభవం (పిక్చర్స్)

తెలంగాణ సాంస్కృతిక ఉత్సవంలో అమ్మాయిలు ఇలా చిందులు వేస్తూ..

 అమెరికా తెలంగాణ వైభవం (పిక్చర్స్)

తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా వేదిక మీద ఎన్నారైలు..

 అమెరికా తెలంగాణ వైభవం (పిక్చర్స్)

తెలంగాణ సాంస్కృతిక ఉత్సవంలో ఎన్నారైలు ఇలా..

 అమెరికా తెలంగాణ వైభవం (పిక్చర్స్)

సంప్రదాయ దుస్తుల్లో మహిళలు ఇలా...

 అమెరికా తెలంగాణ వైభవం (పిక్చర్స్)

సావనీర్ మ్యాగజైన్ సింగిడి ఆవిష్కరణ ఇలా..

 అమెరికా తెలంగాణ వైభవం (పిక్చర్స్)

చిన్నారుల నృత్య ప్రదర్శన

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+