లండన్‌లో తెలంగాణ తల్లి విగ్రహం

ప్రపంచంలోని విదేశాల్లో మొదట తెలంగాణా తల్లి ప్రతిమ ఆవిష్కరణ లండన్‌లో జరగడాన్ని తెలంగాణ జెఎసి నాయకులు పలువురు ఫోన్ చేసి శుభాకంక్షలు తెలుపడం ఆనందంగా ఉందని గంప వేణుగోపాల్ తెలిపారు. ఇది ఉద్యమ స్ఫూర్తి కి దోహదం చేస్తుందని తెలిపారు. తెలంగాణ ఎన్నారైలు చేపట్టిన కార్యక్రమాల్లో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ చారిత్రాత్మకమని అనిల్ కూర్మాచలం అన్నారు.
రంగుల సుధాకర్ సభకు అధ్యక్షత వహించారు. మహిళా విభాగానికి చెందిన పవిత్ర, అర్చనల ఆధ్వర్యంలో ఈ సందర్భంగా కేక్ కట్ చేశారు. తమ సంస్థ చేపట్టిన ఉద్యమ కార్యక్రమాలను, సేవా కార్యక్రమాలను, పండుగ ఉత్సవాలను సిక్క చందుగౌడ్ వివరించారు.
ఉదయ్ నాగరాజ్ తాము చేపట్టబోయే కార్యక్రమాలను, మొదటి వార్షికోత్సవం సందర్భంగా చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. ఐదుగురు పేద ముస్లిలం హజ్ యాత్రకు ఆర్థిక సహాయం అందించినట్లు, ఐదు వేల నోట్ బుక్కులను 2013 - 2014లో పేద విద్యార్థులకు పంపిణీ చేసినట్లు, మెదక్ జిల్లాలో వెంకటాపురం గ్రామాన్ని దత్తత తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమ నిర్వహణకు మర్రి చందు, శ్యాం, శివాజీ, మల్లారెడ్డి సహకరించారు.












Click it and Unblock the Notifications