అట్లాంటాలో తెలుగు మాట్లాట (పిక్చర్స్)

అట్లాంటా: అట్లాంటాలో, తామా విద్యా కార్యదర్శి అనిల్ బొద్దిరెడ్డి ఆధ్వర్యంలో సిలికానాంధ్ర వారి "తెలుగు మాట్లాట" - పలుకే బంగారము... పదమే సింగారము కార్యక్రమం ఘనంగా జరిగింది. పిల్లలలో తెలుగు భాషపై ఉన్న పట్టును మరింత పెంపొందించడానికి, వారికి ఉత్తేజం కలిగించే రీతిలో , సిలికానాంధ్ర తలపెట్టిన తెలుగు మాట్లాట పోటీలను విజయవంతం చేశారు . పిల్లలు ఎంతో ఉత్తేజంగా ఈ పోటీలలో పాల్గొని తమ "తెలుగు ప్రావీణ్యాన్ని" చాటుకున్నారు.

* పదరంగం (తెలుగు స్పెల్లింగ్ బీ) పోటీలో పాల్గొని బహుమతులు గెలుచుకున్నారు. మొదటి స్థానము పొందిన విజేత- సుజయ్ రెడ్డి , ద్వితీయ స్థానం పొందిన విజేత- వైష్ణవి దువ్వూరి , తృతీయ స్థానం పొందిన విజేత- సిరి రెడ్డి

* తిరకాటము (తెలుగు జియోపార్డి) పోటీలో పాల్గొని గెలుగుపొందిన వారు ఇలా ఉన్నారు - మొదటి స్థానం పొందిన విజేత- సాహితి బొద్ది రెడ్డి , ద్వితీయ స్థానం పొందిన విజేత-సుజయ్ రెడ్డి , తృతీయ స్థానం పొందిన విజేత- వైష్ణవి దువ్వూరి

తామా విద్యా కార్యదర్శి అనిల్ బొద్దిరెడ్డి మాట్లాడుతూ - తామా, సిలికానాంధ్ర వారి "తెలుగు మాట్లాట" కార్యక్రమం విజయవంతం కావడంలో ఎనలేని కృషి చేసిన కార్య నిర్వాహక సభ్యులు సంధ్యా ఎల్లాప్రగడ, వినయ్ మద్దినేని, మురళి కాకుమని, నాగరాజు మంతెన, చిట్టారి పబ్బా, శ్రీనివాస్ పెద్ది, న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించిన సుబ్బా రావు మద్దాలి , మాధవ్ దుర్భ, సుచేత కాంచనపల్లి , భారతి అనే, పోటీల్లో పాల్గొన్నపిల్లలకు, వారి తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలియజేసారు.

ఈ కార్యక్రమం ఇంత భారీ ఎత్తున నిర్వహించడంలో ముందుకు వచ్చిన దాత ఎస్ వి కే సిస్ స్టం అధినేత హనుమాన్ నందనంపాటి పోటిలో గెలుపొందిన పిల్లలకు ట్రోఫీలు అందజేశారు. తామా అద్యక్షుడు మహేష్ పవార్ దాతలకు, పోషక దాతలకు, విచ్చేసిన అతిథులకు, పోటీలో పాల్గొన్నపిల్లలకు, వారి తల్లిదండ్రులకు, ఈ కార్యక్రమం విజయవంతం అవడానికి కృషి చేసిన తామా కార్యవర్గ సభ్యులకు తదితరులకు కృతజ్ఞతలు తెలిపారు.

అట్లాంటాలో ప్రాంతీయ పోటితో ఇప్పటికి న్యూ జెర్సీ, టెక్సాస్, నార్త్ కరోలినా , బే ఏరియా (ఫ్రీమోంట్, ఈస్ట్ బే, శాన్ హోసె & కుపెర్టినో) ప్రాంతాలలో పోటీలు ముగిసి, మిగిలిన మిచిగన్, వర్జీనియా, ఫిలడెల్ఫియా, దక్షిణ కాలిఫోర్నియ & అరెగన్ ప్రాంతాలలో పోటీలు సమాప్తమైన తరవాత అమెరికాలో 15 ప్రధాన పట్టణాలలో ప్రాంతీయ పోటీలలో గెలుపొందిన పిల్లలు సెప్టెంబర్ లో లేబర్ డే రోజు కాలిఫోర్నియాలో జాతీయస్థాయి పోటీలలో ఢీకొంటారు.

ఘనమైన బహుమతులు , ప్రశంసా పత్రాలు ఇవ్వడంతో పాటు అన్ని ప్రచార మాధ్యమాల ద్వారా వాళ్ళ ప్రతిభ ప్రపంచం నలుమూలలా తెలియ జేయడం జరుగుతుంది.

అట్లాంటాలో తెలుగు మాట్లాట (పిక్చర్స్)

మాట్లాట అట్లాంటా జట్టు...

అట్లాంటాలో తెలుగు మాట్లాట (పిక్చర్స్)

పదరంగంలోచిరుతలులో విజేత కృష్ణ దువ్వూరి..

అట్లాంటాలో తెలుగు మాట్లాట (పిక్చర్స్)

పదరంగం సిసింద్రీలు పోటీలో తొలి స్థానం పొందిన విజేత సుజయ్ రెడ్డి..

అట్లాంటాలో తెలుగు మాట్లాట (పిక్చర్స్)

పదరంగం సిసింద్రీల్లో ద్వితీయ స్థానం పొందిన వైష్ణవి దువ్వూరి

అట్లాంటాలో తెలుగు మాట్లాట (పిక్చర్స్)

పదరంగం సిసింద్రీలో తృతీయ స్థానం పొందిన సిరిరెడ్డి

అట్లాంటాలో తెలుగు మాట్లాట (పిక్చర్స్)

తిరకాటం సిసింద్రీలో మొదటి స్థానం పొందిన సాహితి బొద్దిరెడ్డి..

అట్లాంటాలో తెలుగు మాట్లాట (పిక్చర్స్)

తిరకాటం సిసింద్రీలో ద్వితీయ స్థానం పొందిన సుజయ్ రెడ్డి

అట్లాంటాలో తెలుగు మాట్లాట (పిక్చర్స్)

తిరకాటం సిసింద్రీలో మూడో స్థానం పొందిన వైష్ణవి దువ్వూరి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+