వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టెక్కీలకు హెచ్ -1బి వీసాలు, గ్రీన్ కార్డులు

By Pratap
|
Google Oneindia TeluguNews

Barack Obama
వాషింగ్టన్: అవుట్ సోర్సింగ్ వీసాలను అమెరికా నైపుణ్య దిగుమతి కార్యక్రమంగా మార్చడానికి అమెరికా సిద్ధపడింది. ఇమిగ్రేషన్ చట్టాలను సరిదిద్దే పనిలో అమెరికా లా మేకర్స్ పడ్డారు హెచ్ -1బి వీసాల దుర్వ్యినియోగం అవుతున్నాయని, బాడీ షాపర్లు, నైపుణ్యంలోని విదేశీ, ముఖ్యంగా భారత్ టెక్నాలజీ వర్కర్లు అమెరికా శ్రామికుల అవకాశాలను దెబ్బ తీస్తున్నారని భావిస్తున్నారు.

నిజానికి హెచ్ -1బి వీసాలను రెండింతలు చేయాలని, వాటిని 65 వేల నుంచి లక్షా 30వేలకు పెంచాలని, అమెరికాలో నైపుణ్యం గల వర్కర్ల కొరత ఉండడంతో వాటిని పెంచాలని సెనేట్ ప్యానెల్ చూస్తోంది. అయితే, ఇందులో ప్రాథమిక లబ్ధిదారులు అవుట్ సోర్సింగ్ కంపెనీలు కావు. ఈ కంపెనీలు వర్కర్లను అమెరికాకు, తమ దేశానికి మధ్య తిప్పుతున్నాయి.

అమెరికాకు చదువు కోసం వచ్చే విద్యార్థులు ఇక్కడే ఉండేలా చూడాలని, వారు అమెరికా ఆర్థిక వ్యవస్థ పుష్టికి పనిచేస్తారని భావిస్తున్నారు. సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్ (స్టెమ్) అమెరికాలో చదివే విదేశీ విద్యార్థులు చదువు పూర్తయిన తర్వాత ఇక్కడే ఉండేలా హెచ్1-బి వీసాలు ఇవ్వాలని, ఆ తర్వాత గ్రీన్ కార్డులు ఇవ్వాలని ఆలోచన జరుగుతోంది.

అమెరికా విశ్వవిద్యాలయాల్లో దాదాపు లక్ష మంది భారత విద్యార్థులు చదువుతున్నారు. యేటా వేల మంది వస్తున్నారు. వీరి వల్ల అమెరికాకు 3 బిలియన్ డాలర్ల కన్నా ఎక్కువ వార్షికాదాయం ఉంటోంది. అమెరికాలో స్థిరపడిన విదేశీయుల తల్లిదండ్రులకు, తోబుట్టువులకు, పెద్ద పిల్లలకు గ్రీన్ కార్డులు ఇచ్చే ప్రక్రియను నియంత్రించాలని చూస్తున్నారు. ఈ నియంత్రణ భార్య లేదా భర్తకు, చిన్న పిల్లలకు వర్తించదు.

ఆ రకంగా అమెరికా కుటుంబ సమైక్యతకు తిలోదకాలు ఇచ్చి, ఆర్థిక, నైపుణ్య ప్రాతిపదిక వలసలను ప్రోత్సహించాలని అమెరికా భావిస్తోంది. అమెరికాలో ఉన్న బంధువుల ద్వారా అమెరికాకు వచ్చే వారి సంఖ్య తగ్గి నైపుణ్యం ఉన్న వారు ఉపాధి కోసం వచ్చే వారి సంఖ్య పెరుగుతుంది. వీసా మేకోవర్‌పై అన్ని కోణాల నుంచి కాంగ్రెసులో చర్చ జరుగుతోంది. అమెరికాలో నైపుణ్యం గల వర్కర్ల కొరత ఉండడంతో మైక్రోసాఫ్ట్, ఐబియం, గూగుల్ విదేశీ వర్కర్ల కోసం చూస్తున్నాయి.

తాము నైపుణ్యం గల విదేశీ వర్కర్లను తీసుకోవాలని అనుకుంటున్నట్లు ఫేస్‌బుక్‌కు చెందిన మార్క్ జుకర్‌బెర్గ్, యాహూకు చెందిన మరిస్సా మేయర్‌లతో పాటు హై ప్రొఫైల్ సిఇవోలు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాకు, లామేకర్స్‌కు లేఖలు రాశారు.

English summary
The United States is poised to turn the so-called outsourcing visa into a skill importing program.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X