ప్రేమికుల రోజున ఎన్నారైల కేరింతలు!

 Valentine's Day Family Fun Event Dallas
డల్లాస్: అమెరికాలోని డల్లాస్‌ లో "ఆక్టేవ్ సౌండ్ ప్రొ" సంస్థ ప్రేమికుల రోజును వినూత్నమైన కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ఎన్నారైలు కేరింతలు కొట్టారు. "ఆక్టేవ్ సౌండ్ ప్రొ" అధినేత "డిజె క్రు" ఈ వినూత్న కార్యక్రమం ద్వారా ఆకట్టుకున్నారు. ఈ సాయంకాలపు సమావేశానికి పద్మ, వెంకట్ ములుకుట్ల దంపతులు వ్యాఖ్యాతలుగా వ్యవహరించగా, ప్రియదర్శిని, చినసత్యం వీర్నపు దంపతులు ఆహ్వాన వేదిక పై అతిథులకు స్వాగతం పలికారు.

భారతీయ సంతతికి చెందిన దాదాపు యాభై కుటుంబాలు స్థానిక రుచి ప్యాలస్ రెస్టారంట్ లో శనివారం సాయంత్రం ఏడు గంటలకు సమావేశమయ్యారు . ఎవ్వరూ ఊహించని రీతిలో పన్నీటి గంధాలు, రోజా పుష్పాలతో ఆహ్వానం, ప్రత్యేకంగా అలంకరించిన వేదికపై వ్యక్తిగత కుటుంబ ఛాయాచిత్రం, మంచి ఊపున్న సంగీతం తో కార్యక్రమం ప్రారంభమయ్యింది. పిల్లలకు ప్రత్యేకంగా మ్యాజిక్ షో, బెలూన్స్, ఫేస్ పెయింటింగ్స్, ఆటలు, పాటలు, నృత్యాలతో అల్లరి పిల్లలంతా ఆనందోత్సాహాలతో కేరింతలు కొట్టారు. ఎప్పుడూ డాన్స్ చెయ్యని యువతీయువకుల లో నిదిరించే డాన్సర్ ను లేపేందుకు ప్రత్యేకంగా డాన్స్ స్టెప్పులు నేర్పిన అంశం అందరినీ విశేషంగా ఆకట్టుకొంది.

"ఆక్టేవ్ సౌండ్ ప్రొ" అధినేత "డిజె క్రు" వేదికపై మాట్లాడుతూ - "ఇలాంటి కలయిక సకుటుంబ సపరివార సమేతంగా అందరి ఆనందం కోసం ప్రత్యేకంగా డాల్లస్ లో మొట్టమొదటి సారిగా ఏర్పాటు చేయడం జరిగింది. విచ్చేసిన మిత్రుల విశేష స్పందన చూసి ఇలాంటి కార్యక్రమాలు మళ్ళీ మళ్ళీ జరపడానికి ఇది ఒక కొత్త స్ఫూర్తి" అన్నారు.

నోరూరించే రుచికరమైన భోజనం తో పాటు చక్కని వేదిక, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించిన రుచి ప్యాలెస్ సిబ్బందికి, యాజమాన్యానికి, గంటల తరబడి తమ అమూల్య సమయాన్ని వెచ్చించి కష్టించిన సేవకులకు, తదితరులకు "ఆక్టేవ్ సౌండ్ ప్రొ" అధినేత "డి జె క్రు" కృతఙ్ఞతలు తెలియజేయడంతో అత్యంత ఆనందాన్ని అందించిన ప్రేమికుల వేదికకు తెరపడింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+