ఆస్ట్రేలియాలో వైజాగ్ యువకుడి మృతి

ఈ నెల 24వ తేదీన కొంత మంది మిత్రులతో కలిసి అతను నదీతీరానికి వెళ్లాడు. అంతా స్నానం చేస్తుండగా రవి రంజన్ ప్రమాదవశాత్తు నదిలో మునిగిపోయాడు. స్నేహితులు అతన్ని రక్షించే ప్రయత్నం చేశారు. అయితే వారి ప్రయత్నం ఫలించలేదు. రవి రంజన్ మరణించాడు. అతని మృతి విషయాన్ని ఆస్ట్రేలియా ప్రభుత్వం సోమవారం ఆయన కుటుంబ సభ్యులకు తెలిపింది.
విక్టోరియాలోని ఐజిఎ సూపార్ మార్ట్‌లో పనిచేస్తున్న అతను ఫ్రాంక్‌స్టన్ టౌన్‌లో మరణించాడు. విపిటి అసిస్టెంట్ ఇంజనీర్ అయిన కె. రమేష్, రమ దంపతులకు రవిరంజన్ ఒక్కడే కుమారుడు. ఐదేళ్ల క్రితం రవిరంజన్ ఆస్ట్రేలియా వెళ్లాడు. అక్కడ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో ఎంబిఎ చేసిన అతను నాలుగేళ్ల క్రితం వరకు మెల్బోర్న్‌లో ఉన్నాడు.
రవిరంజన్‌కు ఈత రాకపోవడం ప్రమాదంగా పరిణమించింది. ఆగస్టులో రవిరంజన్ విశాఖపట్నం రావాలని అనుకున్నాడు. ఆస్ట్రేలియా నుంచి వచ్చే తన కుమారుడి మృతదేహం కోసం తల్లిదండ్రులు నిరీక్షిస్తున్నారు.












Click it and Unblock the Notifications