జనం మెచ్చిన జగన్ ఆడియో

అదే సమయంలో అమెరికాలో డాక్టర్ ప్రేమ్ రెడ్డి ఆడియో ఆల్బమ్‌ను విడుదల చేశారు. వైయస్ సన్నిహిత మిత్రుడైన ప్రేమ్ రెడ్డి ఆడియో ఆల్బమ్‌ను విడుదల చేసి తొలి ప్రతిని వైయస్ ఫ్యాన్ క్లబ్ అధ్యక్షుడు వీరారెడ్డి నంద్యాలకు అందించారు. అమెరికా వైయస్ ఫ్యాన్ క్లబ్ నిర్వహించిన కార్యక్రమాలను షర్మిల ఆడియో ఆల్బమ్‌ను విడుదల చేసిన తర్వాత గుర్తు చేశారు.
ఆడియోలో మొత్తం తొమ్మిది పాటలున్నాయి. ఇందులో తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీ మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డాయని ఆరోపిస్తూ, జగన్‌ను వేధింపులకు గురి చేస్తున్నారని విమర్శిస్తూ రాసిన పాటలు కూడా ఉన్నాయి. వైయస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు సంబంధించిన పాట కూడా ఉంది. ఈ పాటలకు సంగీత దర్శకులు సాయి శ్రీకాంత్, సన్నీ మానిక్ సంగీతం సమకూర్చారు. ప్రభవ శర్మ పాటలు రాశారు. శ్రీకాంత్, రేవంత్, హైమత్, లక్ష్మి పాటలు ఆలపించారు.
ఆడియా ఆల్బమ్‌ను విడుదల చేసిన అనంతరం వైయస్ రాజశేఖర రెడ్డితో తనకు గల అనుబంధాన్ని డాక్టర్ ప్రేమ్ రెడ్డి గుర్తు చేసుకున్నారు. జగన్ క్రమశిక్షణను కూడా ఆయన కొనియాడారు. ప్రజలకోసం జగన్ త్యాగాలు చేస్తున్నారని అన్నారు. 30 వేల ఆడియో సీడిలను ఆంధ్రప్రదేశ్ అంతటా ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు వీరారెడ్డి నంద్యాల చెప్పారు. ఈ నెల 8వ తేదీన జరిగే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ప్లీనరీలో కూడా వాటిని పంపిణీ చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఆడియో ఆల్బమ్‌ను విడుదల చేసినందుకు ఆయన షర్మిలకు కృతజ్ఝతలు తెలిపారు.












Click it and Unblock the Notifications