సింగపూర్లో లిఫ్ట్‌లో మహిళకు వేధింపు: భారతీయుడికి జైలు
సింగపూర్: లిఫ్ట్‌లో ప్రయాణిస్తున్న మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన భారతీయుడికి సింగపూర్ కోర్టు తొమ్మిది నెలల జైలు శిక్ష విధించినట్లుగా వార్తలు వస్తున్నాయి. అతని పేరు సత్తయ్య ఇళయరాజగా(26) తెలుస్తోంది. అతను మహిళను వేధించిన సమయంలో అల్కాహాల్ తీసుకున్నాడని స్ట్రెయిట్ టైమ్స్‌లో కథనం వచ్చింది.

నవంబర్ 7వ తేదీన ఓ అపార్టుమెంటులో తనతో పాటు లిఫ్టులో ప్రయాణిస్తున్న మహిళ పట్ట అతను అసభ్యంగా ప్రవర్తించాడు. లిఫ్ట్ నుండి బయటకు వచ్చిన తర్వాత ఆమె పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు అతనిని అరెస్టు చేసి పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అతనిని కోర్టులో హాజరుపరిచారు. విచారణ అనంతరం కోర్టు అతనికి జైలు శిక్ష విధించింది.
బాధితురాలు 39 ఏళ్ల వయస్సు. ఆమె బ్యూటీషియన్. ఆమెను అతను రెండోసారి కూడా ఫాలో అయ్యాడు. ఆమెతో అనుచితంగా ప్రవర్తించాడు. ఆమె అడ్డుకోవడంతో అతను పారిపోయాడు. కాగా, నిందితుడు మద్యం తాగిన మత్తులో అలా ప్రవర్తించాడని లాయర్ చెప్పారని తెలుస్తోంది. కోర్టు మాత్రం ఆ వాదనను పక్కన పెట్టింది. అతనిని జైలుకు శిక్ష విధించింది.












Click it and Unblock the Notifications