పోర్న్ సిడి వివాదం: ఎన్నారై హత్య

murder
న్యూఢిల్లీ: తమకు తెలిసిన ఓ మహిళ పోర్నోగ్రాఫిక్ సిడిని ఎన్నారై(70) నుంచి తీసుకునే క్రమంలో జరిగిన ఘర్షణలో మైనర్‌తోపాటు ముగ్గురు వ్యక్తులు ఆ ఎన్నారైని హత్య చేశారు. ఈ ఘటన దేశ రాజధాని న్యూఢిల్లీలో జరిగింది. హత్యకు పాల్పడిన నిందితులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు బుధవారం తెలిపారు. దలీత్ సింగ్ అలియాస్ గౌరి (48), ప్రవీణ్ యాదవ్ (23)లు ఓ మైనర్‌తో కలిసి నవంబర్ 15న పశ్చిమ ఢిల్లీలోని శివాజీ ఎన్‌క్లేవ్ ప్రాంతంలో నివాసముంటున్న ఎన్నారై హరిందర్ జిత్ సింగ్ హత్యకు పాల్పడ్డారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కెనడాలోని ఒంటారియోకు వలసవెళ్లిన హరిందర్ సింగ్ తిరిగి వచ్చి పశ్చిమ ఢిల్లీలోని శివాజీ ఎన్ క్లేవ్ ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. కాగా తన అపార్ట్‌మెంటుకు వచ్చిన ఓ మహిళ యొక్క పోర్నోగ్రాఫిక్ వీడియోను హరిందర్ జిత్ సింగ్ చిత్రీకరించడం జరిగింది. అంతేగాక తన అపార్ట్‌మెంటుకు వచ్చిన మరి కొందరు మహిళల వీడియోలను కూడా హరిందర్ జిత్ సింగ్ చిత్రీకరించాడు.

కాగా హరిందర్ జిత్ సింగ్ తన పోర్నోగ్రాఫిక్ వీడియోను తీశాడని, దానిని ఎలాగైనా తిరిగి తీసుకువచ్చి నాశనం చేయాలని ఓ బాధితురాలు, తన బంధువైన గౌరికి చెప్పింది. దీంతో హరిందర్ జిత్ సింగ్ నుంచి ఆ మహిళ యొక్క పోర్నోగ్రాఫిక్ వీడియో సిడిని తిరిగి తీసుకునే క్రమంలో ముగ్గురు నిందితులు హరిందర్ జిత్ సింగ్‌ను హత్య చేశారని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ రణ్‌వీర్ సింగ్ తెలిపారు.

ఎన్నారై నుంచి సిడిని తిరిగి తీసుకునేందుకు ప్రవీణ్, ఓ మైనర్‌ను సహాయం చేయాల్సిందిగా గౌరి కోరాడు. ఇందుకు వారికి ఒక్కొక్కరికి రూ. 10వేలు ఇస్తానని ఒప్పందం కుదుర్చుకున్నాడు. నవంబర్ 15న హరిందర్ జిత్ సింగ్ నివాసంలోకి ప్రవేశించిన నిందితులు అతన్ని ఆ వీడియో సిడిని ఇవ్వాలని కోరారు. ఈ క్రమంలో జరిగిన ఘర్షణలో హరిందర్‌ను బాత్‌రూంలోకి తీసుకెళ్లి చున్నితో ఊరివేసి హత్య చేశారు.

ఆ తర్వాత ఇంట్లోని విలువైన సామాగ్రిని, కెమెరా, మొబైల్ ఫోన్, బైనాక్యూలర్ హ్యాండిక్యామ్, పర్స్, డైరీలు మొదలైన వాటిని అపహరించుకుపోయారు. ఆ తర్వాత ఒప్పందం ప్రకారం గౌరి సహాయం చేసిన ఇద్దరికి చెరో రూ. 10వేలు ఇచ్చివేశాడు. అదే రోజు రాత్రి 8గంటలకు పోలీసులకు సమాచారం రావడంతో విచారణ చేపట్టారు. తమ దర్యాప్తులో పోలీసులు హరిందర్ జిత్ సింగ్ నివాసంలో పలు పోర్నోగ్రాఫిక్ సిడిలను స్వాధీనం చేసుకన్నారు. గాలింపు చర్యలను చేపట్టిన పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా మొత్తం వివరాలు బయటికి వచ్చాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+