NRI News: అమ్మకు చంద్రుడిపై భూమిని బహుమతిగా ఇచ్చిన కూతురు..
తల్లులకు బహుమతులుగా చీరలు, బంగారం, ఇతర వస్తువులు ఇస్తారు. కానీ గోదావరిఖనికి చెందిన ఒక ఎన్నారై మహిళ తన తల్లి కోసం చంద్రమండలంలో ప్లాట్‌ను కొనుగోలు చేసి బహుమతిగా ఇచ్చింది. ఆగస్టు 23న చంద్రయాన్-3 ల్యాండర్ విజయవంతంగా చంద్రుడిపై దిగినప్పుడు తల్లి వకుళాదేవి భూమి రిజిస్ట్రేషన్ పత్రాలను పొందారు. గోదావరిఖని జీఎం కాలనీకి చెందిన వకుళాదేవి కుమార్తె సాయి విఘ్నత 10 ఏళ్ల క్రితం అమెరికాకు వలస వెళ్లి ప్రస్తుతం అక్కడే స్థిరపడ్డారు.
ఆమె అయోవాలోని గవర్నర్ కింబర్లీ కే రేనాల్డ్స్ కార్యాలయంలో ప్రాజెక్ట్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. న్యూయార్క్‌లోని 'ఇంటర్నేషనల్ లూనార్ రిజిస్ట్రీ'కి సంబంధించిన వెబ్‌సైట్ ద్వారా చంద్రునిపై భూమికి రిజిస్ట్రేషన్ చేయవచ్చని తన సహోద్యోగుల ద్వారా తెలుసుకున్న సాయి విఘ్నత. ఆమె తన తల్లికి ఒక చిరస్మరణీయ బహుమతిని అందించాలని నిర్ణయించుకుంది. 2022లో మదర్స్ డే నాడు, విఘ్నాత తన తల్లి పేరు మీద చంద్రునిపై చంద్రునిపై ఒక ఎకరం కోసం దరఖాస్తు చేసింది. ఇందుకోసం 35 లక్షలు ఖర్చు చేశారు.

ఆగస్టు 23న చంద్రయాన్-3 విజయవంతంగా చంద్రునిపై ల్యాండ్ అయినప్పుడు ఇంటర్నేషనల్ లూనార్ రిజిస్ట్రీ నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత భూమికి సంబంధించిన పత్రాలు అందడంతో విఘ్నత కుటుంబం సంతోషం వ్యక్తం చేసింది. ఒక నెల సెలవుపై ఇక్కడికి వచ్చిన విఘ్నాత తన తల్లిని చంద్రుడి స్థల పత్రాలు ఇచ్చి ఆశ్చర్యపరిచింది. ఆమె తండ్రి సుద్దాల రామచంద్రం సింగరేణి కాలరీస్ కంపెనీలో పనిచేస్తూ జీఎం కాలనీలో నివసిస్తున్నారు.
భారత్ ప్రయోగించిన చంద్రయాన్-3 విజయవంతం అవడంతో ప్రపంచ దేశాలు చంద్రుడి పైకి వెళ్లాలని ఆలోచిస్తున్నాయి. ఇప్పటికే చంద్రుడి పైకి వెళ్లాలని జపాన్ సిద్ధంగా ఉంది. అయితే చంద్రుడిపై మానువులు జీవించడానికి అనుకూలమైన వాతావరణం ఉంటే అక్కడి మనుషులు వెళ్లడానకి ప్రయత్నించవచ్చు. దీంతో అక్కడ నివాసం కూడా ఏర్పచుకునే అవకాశాలు ఉన్నాయి. అందుకే చంద్రుడి పై భూములు అమ్ముతున్నారు. అయితే కొన్న వారు చంద్రడిపైకి వెళ్లడం అనేది సాధ్యం కాకపోవచ్చని తెలుస్తోంది. మరోవైపు ప్రగ్యాన్ రోవర్ చంద్రుడిపై పరిశోధనలు కొనసాగిస్తోంది.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications