NRI News: దుబాయ్ డ్యూటీ-ఫ్రీలో మెర్సిడెస్ బెంజ్ కారు గెలుచుకున్న హైదరాబాదీ..!
ఉపాధి కోసం చాలా మంది భారతీయులు గల్ఫ్ దేశాలకు వెళ్తుంటారు. సౌదీ అరేబియా, మస్కాట్, దుబాయి, ఒమన్, ఖతార్, కువైట్ కు చాలా మంది ఇండియాన్స్ వెళ్తారు. ముఖ్యంగా కేరళ నుంచి ఎక్కువగా వెళ్తారు. ఆ తర్వాత తెలంగాణ నుంచి కూడా ఎక్కువగా వెళ్తుంటారు. అయితే అక్కడ లాటరీ టికెట్లు ఎక్కువగా విక్రయిస్తుంటారు. ఈ లాటరీ టికెట్లను భారతీయులు కూడా కొనుగోలు చేస్తుంటారు. గతంలో చాలా మందికి లాటరీలో డబ్బులు వచ్చాయి. తాజాగా దుబాయ్ డ్యూటీ-ఫ్రీ (DDF) మిలీనియం మిలియనీర్ అండ్ ఫైనెస్ట్ సర్‌ప్రైజ్ డ్రాలో హైదరాబాద్ కు చెందిన 50 ఏళ్ల భారతీయ జాతీయుడు మెర్సిడెస్ బెంజ్ AMG GT 43 (అబ్సిడియన్ బ్లాక్ మెటాలిక్) కారును గెలుపొందాడు.
అక్టోబర్ 9 బుధవారం డ్రా తీయగా.. అతనికి కారు వచ్చింది. విజేత రాజీవ్ లఖోటియా సెప్టెంబర్ 26న దుబాయ్ నుంచి హైదరాబాద్‌కు వెళుతుండగా 0826 నంబర్ టిక్కెట్‌ను కొనుగోలు చేశాడు. అతను కొనుగోలు చేసిన టికెట్ కు కారు బహుమతిని వచ్చింది. బిసినెస్ చేసే లఖోటియా DDF ప్రమోషన్‌లో రెగ్యులర్‌గా పాల్గొనేవారు. లఖోటియాతో పాటు, షార్జాలో ఉన్న 55 ఏళ్ల భారతీయుడు జోతిభాసు మాధవన్ మెర్సిడెస్ బెంజ్ S500 (అబ్సిడియన్ బ్లాక్ మెటాలిక్) కారును, దుబాయ్‌లో ఉన్న భారతీయ జాతీయుడు షిహాబుదీన్ M BMW R 1250 RS (ట్రిపుల్ బ్లాక్) కారును గెలుచుకున్నారు.

బుధవారం జరిగిన దుబాయ్ డ్యూటీ ఫ్రీ మిలీనియం మిలియనీర్ డ్రాలో అల్ ఐన్‌లోని 67 ఏళ్ల సిరియన్ ప్రవాసుడు అలీ అక్రమ్ అరబో ఒక మిలియన్ డాలర్లను గెలుచుకున్నాడు. గత జూన్ లో తెలుగు వ్యక్తికి లాటరీలో రూ. 2.25 కోట్లు గెలుచుకున్నాడు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బోరుగడ్డ నాగేంద్రమ్ 2017లో దుబాయ్ వెళ్లారు. అతను తరుచూ లాటరీ టికెట్ కొనుగోలు చేస్తుంటాడు. ఈ క్రమంలోనే అతను ఏకంగా రూ.2.25 కోట్లు గెలుపొందాడు.
అతను 10 లక్షల యూఏఈ దిర్హమ్స్ అందుకున్నారు. అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.2.25కోట్లకు పైగానే ఉంటుంది.












Click it and Unblock the Notifications