NRI News: ఎడారిలో నిర్మల్ జిల్లా వాసి.. రక్షించాలంటూ వేడుకోలు..!
చాలా మంది ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్తుంటారు. అయితే ఇలా వెళ్లే క్రమంలో ఏజెంట్ చేతిలో చాలా మంది మోసపోయిన ఘటనలు ఉన్నాయి. మంచి పని, జీతం ఎక్కువని ఏజెంట్ల మాటలు చాలా మంది నమ్మి నష్టపోతున్నారు. తాజాగా నిర్మల్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి ఏజెంట్ చేతిలో మోసపోయి గల్ఫ్ దేశంలో అవస్థలు పడుతున్నారు. తన భర్తను కాపాడాలని అతని భార్య ప్రభుత్వాన్ని కోరుతోంది. తన భర్తను డొమెస్టిక్ హెల్పర్ వీసాపై కువైట్ కు తీసుకెళ్లి అక్రమంగా సౌదీ అరేబియాకు తీసుకెళ్లారని ఆమె చెప్పారు.
ఎడారిలో బలవంతంగా ఒంటెల కాపరిగా పనిచేయిస్తున్నారని తెలిపారు. బాధితుడి భార్య సోమవారం మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ ఈరవత్రి అనిల్ కుమార్ తో కలిసి సికింద్రాబాద్ లోని పాస్ పోర్ట్ కార్యాలయంలో ప్రొటెక్టర్ ఆఫ్ ఇమిగ్రేషన్ అధికారి అమిత్ కుమార్ కు వినతిపత్రం ఇచ్చారు. నిర్మల్ జిల్లా ముధోల్ మండలం రువ్వి గ్రామానికి చెందిన రాథోడ్ నామ్ దేవ్ అనే గిరిజనుడు ఉన్న ఊరిలో ఉపాధి లేక గల్ఫ్ కు వెళ్లాలని నిర్ణయించారు.

ఢిల్లీలోని సనా ఫెసిలిటేషన్ సెంటర్ అనే లైసెన్స్ రిక్రూటింగ్ ఏజెన్సీ ద్వారా అక్టోబర్ 2023 లో డొమెస్టిక్ హెల్పర్ (ఇంటి పని) వీసాపై కువైట్ కు
వెళ్లాడు. కువైట్ ఇంటి పని ఇవ్వకుండా అక్రమంగా సౌదీ అరేబియా సరిహద్దు తీసుకెళ్లి ఎడారిలో ఒంటెల కాపరిగా నియమించారని భార్య నామ్ దేవ్ భార్య లక్ష్మి చెప్పారు. నామ్ దేవ్ ఎడారిలో ఇబ్బంది పడుతున్నారు. వసతి, ఆహారం లేక తీవ్ర అవస్థలు పడుతున్నట్లు నామ్ దేవ్ చెప్పారని లక్ష్మి పేర్కొంది.
తనను రక్షించాలని నామ్ దేవ్ సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేశాడు. ఆరోగ్యం క్షీణిస్తోందని తనను రక్షించాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. రామ్ దేవ్ కువైట్ కు తీసుకెళ్లిన ఏజెంట్ కు ఫోన్ చేస్తే ఎత్తడం లేదని లక్ష్మి చెబుతున్నారు. సౌదీలో తన భర్తను అక్కడి ఒంటెల యజమాని తీవ్రంగా హింసిస్తున్నారని వెంటనే తన భర్తను భారత్ తీసుకురావాలని కోరారు.












Click it and Unblock the Notifications