NRI News: విమానంలో అలా చేస్తారా.. వైరల్ అవుతున్న పోస్ట్..!
విమానంలో ఇష్టమొచ్చినట్లు ప్రవర్తించిన ఓ భారతీయుడిపై మరో భారతీయ వ్యక్తి రెడ్డిట్ లో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. మ్యూనిచ్ నుంచి విమానంలో ఢిల్లీకి వస్తున్న వ్యక్తులు గందరగోళం సృష్టించారని, బిగ్గరగా మాట్లాడారని, అసభ్యంగా ప్రవర్తించారని, ఇతర ప్రయాణీకులను పట్టించుకోలేదని అతను పోస్ట్ లో పేర్కొన్నాడు. తాను క్రాకోవ్ లో ఉంటానని.. కానీ విమానంలో తోటి ప్రయాణికుడు చేసింది చూసి సిగ్గుపడినట్లు చెప్పుకొచ్చారు.
సదరు వ్యక్తి విమానంలో ఎక్కువ సౌండ్ తో రీల్స్ చూశాడు. అలాగే యూట్యూబ్ లో వీడియోలు చూశాడని అన్నారు. హెడ్ ఫోన్స్, హియర్ బర్డ్స్ లేకుండా వీడియోలు చూసినట్లు పేర్కొన్నాడు. ఇలా చేయడంతో తోటి ప్రయాణికులను ఇబ్బంది పెడుతుందని అన్నారు. సివిక్ సెన్స్ ఉండాలని చెప్పారు. ఈ పోస్ట్ కు చాలా మంది నెటిజన్లు స్పందించారు.

"నేను చివరిసారి ముంబై నుంచి లండన్‌కు వెళ్లాను. ఫ్లైట్ ల్యాండ్ అయిన తర్వాత ప్రజలు దిగిన తర్వాత, మేమంతా లేచి నిలబడి క్యూ కదలడం ప్రారంభించే వరకు నిలిచి ఉన్నాము. భారతీయ యువకుడు నా చేయి తట్టి అతని కోసం ఖాళీ చేయమని అడిగాడు. అక్కడ ఎవరికీ ఖాళీ లేదని అతని తెలుసు. నేను అతనిని పట్టించుకోలేదు. దీంతో అతను ఆగ్రహం వ్యక్తం చేశాడు" అని ఓ వ్యక్తి చెప్పుకొచ్చాడు. సరే తను ప్రవాసిగా నేను ఇది నిజమని ధృవీకరించగలను అని మరో వ్యక్తి పోస్ట్ చేశాడు.
తాను భారతదేశం నుంచి జర్మనీకి 4 సార్లు మాత్రమే ప్రయాణించినప్పటికీ ఎలాంటి ఘటనలు జరగలేదని పేర్కొన్నాడు. మరో వ్యక్తి కూడా ఇలానే కామెంట్ చేశాడు. తను కనీసం 50 సార్లు అంతర్జాతీయంగా ప్రయాణించాను. ప్రతిసారీ అదే అనుభవాన్ని పొందినట్లు వివరించారు. ఏది ఏకమైనప్పటికీ విమానంలో ప్రయాణం చేస్తున్నప్పుడు మన ఇష్టమొచ్చినట్లు కాకుండా ఎవరికి ఇబ్బంది కలుగకుండా ఉండాలని నెటిజన్లు కోరుతున్నారు. గతంలో ఓ విమానంలో ఓ ప్రయాణికుడు మరో ప్రయాణికుడిపై మూత్రం పోశాడు. ఇది అప్పట్లో సంచలనం సృష్టించింది.












Click it and Unblock the Notifications