సందడిగా సాగిన ‘ఆటా’ సమ్మర్ ఫెస్ట్(ఫొటోలు)
న్యూజెర్సీ: అమెరికా తెలుగు సంఘం(ఆటా) ఆధ్వర్యంలో న్యూజెర్సీలోని థామ్సన్ పార్క్‌లో సమ్మర్ ఫెస్ట్-2015 సందడి సాగింది. న్యూయార్క్, పెన్సిల్వేనియా, న్యూజెర్సీ, డెలవేర్ తదితర ప్రాంతాల నుంచి 500మందికి పైగా ప్రవాసులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నిర్వహించిన ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో చిన్నా పెద్దా లేకుండా అందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు. వాలీబాల్ టోర్నమెంటును కూడా ఈ సమ్మర్ ఫెస్ట్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆటా అధ్యక్షుడు సుధాకర్ పెర్కారి, జాయింట్ ట్రేజరర్ సురేష్ జిల్లా, ఇతర సంస్థల నేతలు పాల్గొన్నారు.

మహిళల కోసం టాటూస్, చిన్న పిల్లలకు ముఖాలకు పెయింటింగ్, మెహందీ కార్యక్రమాలను నిర్వహించారు. పిల్లలు, పెద్దలకు వివిధ రకాల ఆటలను నిర్వహించారు. భారీ సంఖ్యలో పాల్గొన్న ప్రవాసులు బృందాలుగా ఏర్పడి ఉత్సాహంగా పాల్గొన్నారు. ఎన్‌బిటి-1 టీమ్ ఛాంపియన్‌గా నిలవగా, ఎన్‌జె ఇండియన్స్ రన్నరప్‌గా నిలిచింది. పాల్గొన్న అన్ని టీంలకు ట్రోఫీలను అందజేశారు.

విజేతలందరికీ సర్టిఫికేట్లను అందజేశారు. ఈ ఆటలను రాజ్ చిలుముల, ఇందిరా దీక్షిత్, ఇతర ఆటా వాలంటీర్లు నిర్వహించారు. న్యూజెర్సీకి చెందిన లీలా, కృష్ణా రాణి వినసొంపైన పాటలతో అలరించారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అందరికీ ఆటా నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో పరమేశ్ భీంరెడ్డి, మహి సన్నపరెడ్డి, రవీందర్ మార్పరగ్డ, రఘువీర్ రెడ్డి, రవి పట్లోల, పరుశురాం పిన్నపురెడ్డి, శ్రీని దుర్గాల, వేణు సంకినేని, లక్ష్మణ్ అనుగు, వినోద్ కోడూరు, కృష్ణా ద్యాప, విజయ్ కుందూరు, శ్రీకాంత్ గుడిపాటి, వరుణ్ మందాడి, రాజ్ శీలం, విజయ్ గంగుల, అరుణ్ అయ్యగారి, శ్రీనివాస్ రణబోతు, నారాయణ పిర్లమర్లాండ్, రమేష్ మాగంటి పాల్గొన్నారు. జాతీయ గీతాలాపనతో కార్యక్రమం ముగిసింది.
-
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్‌తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని -
సూపర్ స్టార్ రజినీకాంత్ "జైలర్ 2"లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. -
ఏపీలో ఉచిత గ్యాస్ సిలెండర్ల లబ్దిదారులకు సర్కార్ గుడ్ న్యూస్..! -
Kerala Polls 2026: భారీ పోలింగ్ వెనుక రహస్యం ఇదే..!!












Click it and Unblock the Notifications