ATA: సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం పలికిన ఆటా ప్రతినిధులు..
అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) ఆధ్వర్యంలో 18వ ఆటా కన్వెన్షన్ & యూత్ కాన్ఫరెన్స్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 2024 జూన్ 7 నుంచి 9 వరకు అమెరికాలోని జార్జియా రాష్ట్రంలోని అట్లాంటాలో ఈ వేడుకలు నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆటా అధ్యక్షులు బొమ్మినేని మధు చెప్పారు. ఈ వేడుకలకు కమిటీని కూడా నియమించారు. కోఆర్డినేటర్ తిరుపతి శ్రీధర్, నేషనల్ కోఆర్డినేటర్ గా సుధిని సాయి ఉండనున్నారు.
ఆటా ప్రతినిధులు ఆటా కన్వెన్షన్ & యూత్ కాన్ఫరెన్స్ వేడుకలకు సినీ, రాజకీయ ప్రముఖులను ఆహ్వానించేందుకు హైదరాబాద్ వచ్చారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభలకు రావాల్సిందిగా ఆహ్వానం పలికారు. అలాగే ప్రముఖ నటుడు బాలకృష్ణలకు బొమ్మినేని మధు ఆధ్వర్యంలోని బృందం ఆహ్వానం అందజేసింది. అంతకు ముందు ఆటా బృందం పరశురామ్ దర్శకత్వంలో టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ , హీరోయిన్ మృణాల్ ఠాకూర్, ప్రముఖ నటులు అజయ్ ఘోష్ తదితరులు నటించిన ది ఫ్యామిలీ స్టార్ తెలుగు సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్నారు.

ప్రముఖ యాంకర్ సుమ ఆటా ప్రతినిధులను స్టేజీపైకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మధు మాట్లాడుతు ఆటా కన్వెన్షన్ లో పాల్గొనవలసిందిగా కోరారు. ది ఫ్యామిలీ స్టార్ సినిమా విజయం సాధించాలని కోరుకున్నారు. ఆటా బృందం ది ఫ్యామిలీ స్టార్ సినిమా టీంతో ఫోటోలు దిగారు. ఆటా వేడుకలు నిర్వహించడమే కాకుండా సామాజిక సేవ కార్యక్రమాల్లో ముందుంది. ఆటా నేతృత్వంలో చాలా మందికి సాయం చేశారు. ఆటా కన్వెన్షన్ & యూత్ కాన్ఫరెన్స్ మరింత మంది ప్రముఖులను ఆహ్వానించనున్నట్లు చెప్పారు.












Click it and Unblock the Notifications