NRI News: లాటరీలో రూ.33 కోట్లు గెలుచుకున్న భారతీయుడు..

యూఏఈలో ఉద్యోగం చేస్తున్న భారతీయుడు జాక్ పాట్ కొట్టాడు. లాటరీలో ఏకంగా రూ.33 కోట్లు గెలుచుకున్నాడు. కేరళకు చెందిన రాజీవ్ అరిక్కట్ యూఏయీలోని అల్ ఐన్‌లోని ఆర్కిటెక్చరల్ సంస్థలో పనిచేస్తున్నారు. అతనికి బిగ్ టికెట్ అబుదాబి వీక్లీ డ్రాలో అరిక్కట్ 15 మిలియన్ దిర్హామ్‌ల (సుమారు రూ. 33 కోట్లు) విలువైన జాక్‌పాట్‌ను గెలుచుకున్నాడు. అతను తన ఇద్దరు పిల్లల పట్టిన రోజు తేదీలతో టికెట్ కొనుగోలు చేశాడు.

రాజీవ్ అతని భార్య, ఐదు, ఎనిమిది సంవత్సరాల వయస్సు గల ఇద్దరు చిన్న పిల్లలతో యూఏఈలో నివసిస్తున్నారు. అతను గత మూడు సంవత్సరాలుగా బిగ్ టికెట్ డ్రాలలో పాల్గొంటున్నాడు. ఈసారి అతను, అతని భార్య తన పిల్లల పుట్టిన తేదీలు అయిన 7, 13 నంబర్‌లను కలిగి ఉన్న టికెట్లను కొనుగోలు చేశారు. ఖలీజ్ టైమ్స్ ప్రకారం రాఫిల్ డ్రా నంబర్ 260 సమయంలో అరిక్కట్ విజేత టికెట్ - నంబర్ 037130 - ఫ్రీగా పొందారు.

An Indian man won Rs.33 crores in Big Ticket Abu Dhabi Weekly

"నేను అల్ ఐన్‌లో 10 సంవత్సరాలకు పైగా నివసిస్తున్నాను. నేను గత మూడు సంవత్సరాలుగా టిక్కెట్లు కొనుగోలు చేస్తున్నాను. నాకు లాటరీ తగలడం ఇదే మొదటిసారి. ఈసారి నేను, నా భార్య మా పిల్లల పుట్టిన తేదీలు అయిన 7, 13 నంబర్లతో టికెట్లను కొనుగేలు చేశాం. బిగ్‌ టికెట్‌పై ఈసారి స్పెషల్ ఆఫర్ ఉంది. నేను రెండు టికెట్లు కొంటే నాలుగు ఉచితంగా వచ్చాయి" అని రాజీవ్ అరిక్కట్ చెప్పారు.

తాను లాటరీ టికెట్లు కొన్న ప్రతిసారి తనకే వస్తుందని నమ్మేవాడినని రాజీవ్ పేర్కొన్నారు. 6 టికెట్లు ఉండడంతో ఇంకా నమ్మకం బలపడిందన్నారు. తనకు వచ్చిన డబ్బును 19 మంది సమానంగా పంచుకుంటానని చెప్పారు. భారత్ నుంచి వచ్చిన మధ్యతరగతి లేదా దిగువ మధ్యతరగతి వారు ఈ లాటరీలలో పెద్ద సంఖ్యలో చురుకుగా పాల్గొంటున్నారు. వారిలో గణనీయమైన సంఖ్యలో గత కొన్ని సంవత్సరాలుగా పెద్ద బహుమతిని గెలుచుకున్నారు.

గత ఏడాది డిసెంబర్ 31న బిగ్ టికెట్ లైవ్ డ్రాలో భారతదేశానికి చెందిన ఒక ప్రైవేట్ డ్రైవర్ 20 మిలియన్ UAE దిర్హామ్‌ల (సుమారు రూ. 44 కోట్లు) జాక్‌పాట్ బహుమతిని గెలుచుకున్నాడు. గల్ఫ్ న్యూస్ ప్రకారం, సిరీస్ 259 బిగ్ టికెట్ లైవ్ డ్రాలో మునావర్ ఫైరూస్ అదృష్ట విజేతగా ఎంపికయ్యాడు. నవంబర్ 2023లో UAEలోని చమురు మరియు గ్యాస్ పరిశ్రమలో కంట్రోల్ రూమ్ ఆపరేటర్‌గా పని చేస్తూ రూ. 45 కోట్లు గెలుచుకున్నాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+